AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

EDనుRSS దుర్వినియోగపరచటంపై దూషించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా…

1 min read

AAB NEWS : స్థానిక మన్సూర్ నగర్ లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీసు లపై మరియు నాయకుల ఇళ్ళపై ఈ మద్య జరిగిన సోదాలు ఏమి తెలియపరుస్తున్నాయంటే ఎన్ఫోర్సమెంట్ డైరెక్టర్(ED) RSS చేతుల్లో ఆయుధంగా పని చేసిందే తప్ప ఒక నిష్పక్ష స్వతంత్ర ఏజెన్సీ గా పనిచేయలేదు అని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ కౌన్సిల్ తెల్పిందనో చెప్పారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై జరుగుతున్న క్షుద్ర వేట కేవలం పాపులర్ ఫ్రంట్ ప్రజా వ్యతిరేక ఐడియాలజీ కల RSS తో ఎలాంటి రాజీ లేకుండా వ్యతిరేకించటమే అని భారతదేశ ప్రజలకు తెలుసు.
భారతదేశంలో వెనుకబడిన ముస్లిం కమ్యూనిటి సాధికారత పై ద్రుష్టి ఉంచి పనిచేస్తున్న ప్రజా సంస్థే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ప్రజల చందాలతో నడుస్తున్న సంస్థ కాబట్టి ప్రభుత్వ నియమాలను మరియు ఆర్థిక లావాదేవీల సంబంధించిన నియామకాలను పూర్తిగా పాటిస్తుంది. విభజించే మరియు మతోన్మాద ఎజెండా కు వ్యతిరేకంగా గొంతు విప్పే వారిని అనిచివేయటానికి RSS మరియు దాని రాజకీయ పక్షమైన BJP ED ను దుర్వినియోగ పరుస్తున్నాయి.
ED మరియు ఇతర ప్రభుత్వ విచారణ ఏజెన్సీ లు తక్కువ ఆర్థిక వనరుల కల మరియు లావాదేవీలు గల సంస్థలను విచారిస్తున్నాయె తప్ప పెద్ద కార్పొరేట్ లు మరియు రాజకీయ గ్రౄపులు మరియు RSS లబ్ధి చేకూర్చే NGO’s లపై చెయ్యి వేయాలన్న భయపడుతుంది.ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఎటువంటి పూచీలను చూపకుండా వందల కోట్ల డబ్బు ను అధికార బిజెపి పార్టీ పొందినప్పుడు వాటిపై ఏజెన్సీ లు ప్రశ్నించక పోవడం విచారణ సంస్థలు తమ విశ్వసనీయత ను కోల్పోతాయి.
ఈ PFI కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు కేవలం సంస్థ ను ఒంటరిగా చేయటమే కాకుండా భారతదేశం లో సమపౌరసత్వం తో రాజ్యాంగ హక్కులు ముస్లిములు పొందకుండా చేయడానికి జరుగుతున్న కుట్రలని జాతీయ కార్యవర్గ కౌన్సిల్ పునరుద్ఘాటించింది.పాపులర్ ఫ్రంట్ ను లక్ష్యంగా చేసుకొని కడపటి లక్ష్యం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు మరియు భారతదేశ ముస్లిం సమాజానికి తోడుగా ఉన్న నిష్కలంకమైన మరియు గౌరవమర్యదలు కల సంస్థ లను మరియు నాయకులను భయభ్రాంతులు చేయటమే హిందుత్వం యొక్క విస్తారమైన ఎజెండా.
నూతనంగా చేపట్టుతున్న కుట్రపూరిత చర్యలు సంస్థ ను మౌనంగా ఉంచలేవు అని స్పష్టంగా NEC తెలిపింది. రాజ్యాంగ సంస్థ లు తమ అధికారాన్ని దుర్వినియోగ పరచకుండా భారత రాజ్యాంగం మరియు రూల్ ఆఫ్ లా ప్రకారం నడుస్తాయని ,ప్రజలలో రాజ్యాంగ సంస్థలపై కల విశ్వసనీయత ను కోల్పోరని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ కౌన్సిల్ అభిప్రాయ పడుతుంది.

 112 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.