September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

“ED” RSS కు సాధనంగా ఉండటం ఆపండి అని V.R.C వద్ద నిరసనలు తెలియజేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా…

1 min read

AABNEWS :నెల్లూరు స్థానిక V.R.C అంబేద్కర్ బొమ్మ వద్ద మన రాష్ట్రంలో నంద్యాల లోపాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు SDPI నాయకుల ఇళ్ళపై RSS ఆజ్ఞలను అనుసరించి ED డైరెక్టరేట్ ఆఫ్ ఎన్షోర్సమెంట్ చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిరసనలు తెలియబరిచింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ రాజ్యాంగ సంస్థ అయిన ED ( డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్సమెంట్) నేడు మతోన్మాద RSS చేతిలో కీలుబొమ్మగా మారి దేశ ప్రజల సాధికారత కోసం నిరంతరం శ్రమించే జాతీయ రిజిస్టర్డ్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలోని కర్నూలు జిల్లా ,నంద్యాల పట్టణం మరియు దాని తాలుకా గ్రామాలైనా ఆయూలూరు ,ఉపరిపేట ,కానాలా ,సరస్వతి నగర్ మరియు నందమూరి నగర్ లలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు SDPI నాయకుల ఇళ్ళపై ఏదో కోట్ల ధనం ఉందని ,వీరికి డబ్బులు కట్టలు కట్టలు వస్తున్నాయని నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది . కానాలా లో అడ్వకేట్ అలీ ఇంట్లో “ఇడి” సొదాలు నిర్వహించింది .నంద్యాల లో ఒక మారుమూల ప్రాంతామైన కానాలా లోని అలీ స్వయంకృషితో ,పట్టుదలతో అడ్వకేట్ అయ్యి ప్రస్తుతం సుప్రీంకోర్టు లో ప్రాక్టీస్ చేస్తున్నారు .గత సంవత్సరం CAA -NRC-NPR వ్యతిరేక నిలసనలను అనిచివేయటానికి ఈశాన్య ఢిల్లీలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతంలో మతోన్మాదులు మారణహోమాన్ని స్రృష్టించి ముస్లిముల ఇళ్ళను ,మసీదులను మరియు దర్గాలను నిప్పంటించి ప్రాణ ధన నష్టమంను కల్గించి దానికి తోడు ప్రజలను రక్షించాలసిన ఢిల్లీ పోలీసులు ఈ మారణహోమానికి మతోన్మాదులకు అన్ని విధాలుగా సహకరించారు.నవ్వు పుట్టించే విషయం ఏమిటంటే మారణహోమానికి బలైన కుటుంబాలను ,బాధితులను ఈ మారణహోమానికి బాధ్యులుగా గొప్పగా చిత్రకరించారు ఇలాంటి సమయంలో బాధితులకు లీగల్ సహాయం కోసం సుప్రీంకోర్టు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అడ్వకేట్స్ టీమ్ హెల్ప్ డెస్క్ ను పెట్టి బాధితులకు న్యాయం కోసం పోరాడటం జరిగింది .ఈ టీమ్ లో సుప్రీంకోర్టు జూనియర్ అడ్వకేట్ అయిన అలీ గారు కూడా ఉన్నారు .దీనిపై ప్రతికారంతో RSS ఉసికొలిపితే ఢిల్లీ నుంచి ED కానాలా మరియు ఇతర నంద్యాల ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దేశంలో దినదినము అభివృద్ధి జరుగుతు ముందుకు దూసుకుపోతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ను మరియు SDPI ను ఏ విధంగానైనా దెబ్బతీసి ముస్లిం సమాజాన్ని మరియు దళితులు ,అణగారిన వర్గాల ను సర్వనాశనం చేయాలన్న నీచపు ఆలోచనలతో ఈ కుట్రలు జరుగుతున్నాయి అని అన్నారు. ఎవరు ఎంత కుట్రలు కుంతంత్రాలు చేసిన పాపులర్ ఫ్రంట్ మరియు SDPI యొక్క ఒక వెంట్రుకను కూడా పీకలేరని అని తెలిపారు.
SDPI జిల్లా అధ్యక్షులు ముహమ్మద్ గని మాట్లాడుతూ దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మి వచ్చిన కోట్ల ధనంతో M.P. లను M.L.A. లను ఎవరు మార్కెట్ లో జంతువులను కొన్నట్లు కొంటున్నారో అందరికి తెలుసని .డబ్బు మరియు మద్యం పంచకుండా నిజాయితీ మరియు ప్రజల క్షేమం కోసం తప్పించే గుణాన్ని చూసే ప్రజలు SDPI కు ఓట్లు వేసి అధికారం ఇవ్వదలిచారాని. దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు డబ్బు మరియు మద్యం పంపిణీ చేయకుండా ఓట్లలకు రేటు పెట్టి రాజకీయాలు చేయకుండా నిజాయితీగా ఎన్నికల్లో పాల్లోని SDPI ని ఎదురించి మేము కూడా మొగాళ్ళమే నిరంపించుకొండి అంతే తప్ప నిందలు మోపి ఆరోపణలు చేసి SDPI ను నష్టపరచాలనుకోవటం వెర్రితనం అని తెలిపారు.బిజెపి SDPI ఎదుగుదలను చూడలేక కడపుమండి స్వతంత్ర దర్యాప్తు సంస్థలనం కీలుబొమ్ములుగా ఉపయోగించుకొని ఇలాంటి నీచపు కార్యక్రమాలు నిర్వహిస్తుందని.ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పారుఈ నిరసన కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు ,ప్రజలు పాల్గొన్నారు.

 3,270 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.