PFI కార్యకర్తలను విడుదల చేయాలని నిరసన…
1 min read
AABNEWS : నెల్లూరు స్థానిక V.R.C సెంటర్ లోని అంబేడ్కర్ బొమ్మ దగ్గర పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇతర ప్రజా సంఘాలతో కలిసి అన్యాయంగా అరెస్టు కాబడ్డ PFI కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తు నిరసనలు తెలియబరిచారు.పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ అన్షద్ మరియు ఫైరోజ్ అనే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు బెంగాల్ మరియు బీహార్ లో సంస్థ విస్తీర్ణం కార్యక్రమాలు చూసుకొని కేరళ కు రైలు లో తిరిగి వస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ ఇద్దరిని చట్టవ్యతిరేకంగా కిడ్నాప్ చేసి తీరా కేరళ లో వారి ఆచూకి కోసం గాలింపు మొదలు పెట్టంగానే నాలుగు రోజులు తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు వారిపై అభియోగాలు మొపి కోర్టు ముందుకు తీసుకొని రావటం జరిగిందని .వారిని ఉగ్రవాదులు ఆనే కోణంలో విచారణ జరపడం దారుణమని .ఉత్తరప్రదేశ్ లో యోగి పాలనలో ఏమి జరుగుతుంది ?అని ప్రశ్నించారు. నేడు చట్టాలు ,న్యాయవ్యవస్థ కు వ్యతిరేకంగా పోలీసులు రాజకీయాలకు అమ్ముడుపోయి ఫ్యాసిస్ట్ శక్తుల చేతుల్లో పావులుగా మారిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ నే భ్రష్ఠు పట్టస్తున్నారని .మైనారిటీ లు అధిక శాతం ఉన్న ఉత్తరప్రదేశ్ నేడం జంగిల్ రాజ్ గా మారిపోయిందని .గుండాలు పోలీసుల వాహనాలలో మారణ ఆయుధాలు తీసుకొని తిరుగుతున్నారని.ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య కాబడుతుందని .దేశం కోసం ,ప్రజాస్వామ్యం కోసం మరియు రాజ్యాంగ రక్షణ కోసం ఎవరైనా మాట్లాడితే నోరు తిరిస్తే వారిపై కీలుబొమ్ములుగా మారిన ఏజెన్సీ లను పంపడం వేధించటం జరుగుతుంది. కేసులు పెట్టి అరెస్టులు చేయడం జరుగుతుందని తెలిపారు. నేడు EVM ట్యాంపరింగ్ తో ,ఇతర పార్టీల M.Pలను M.L.A లను మార్కెట్ లో పసువులను కొన్నట్లు కోట్లు పెట్టి బిజెపి అధికారంలోకి వచ్చి రాజ్యాంగానికి మరియు దేశానికి వ్యతిరేకంగా చట్ట సభలలో చట్టాలు చేయడం వాటిని విమర్శించిన వారిపై నిరసనలు వారిపై UAPA లాంటి నల్లచట్టాలను వేసి అరెస్టులు చేయించడం .కేంద్ర ఏజెన్సీ లను తమ పనిముట్లు గా మార్చుకుని రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించటం సర్వసాధారణం అయిపోయింది .నేడు వీరి చేసే దురాగతాలు ప్రజాస్వామ్య వ్యవస్థ లకే ఒక సవాలు గా మారినాయి .దేశంలో ఇంత జరిగుతున్న నిజంగా నే గుడ్డిది అయిపోయిన న్యాయవ్యవస్థ. పట్టపగలు న్యాయవాదుల హత్యలు మరియు దాడుల సంస్కృతి .దీనిని ఇలాగే వదిలేస్తే రేపు న్యాయమూర్తులకు కూడా రక్షణ లేకుండా వారు కూడా బిక్కు బిక్కు మని బ్రతికే రోజులు వచ్చినాయని .పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ ఫ్యాసిస్ట్ శక్తులు చేసే కుట్ర కుంతంత్రాలకు భయపడదని ప్రజాస్వామ్య పద్దతిలో న్యాయం మరియు చట్టాలను గౌరవిస్తు న్యాయ పరంగా పోరాటం చేయడం తెలుసని తెలిపారు .ఈ నిరసనలో C.L.C, I.L.A ఇన్సాఫ్ ,ఆవాజ్ ,AIFY , వివిధ సంఘాలు మరియు జమాత్ ల పెద్దలు పాల్గొన్నారు.
519 Total Views, 2 Views Today