న్యూఇయర్ ఆంక్షలు వైన్ షాపులకు కాదు…
1 min read
AABNEWS : కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండడంతో పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలను తీసుకుని వస్తున్నాయి. దానికి తోడుగా.. బ్రిటన్ లో కొత్త రకం స్ట్రెయిన్ కనపడడంతో అధికారులు మరింతగా అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఏడాది ఆఖర్లో కఠిన నిబంధనలను అమలు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ నిబంధనలకు ఆంధ్రప్రదేశ్ లో వైన్ షాప్స్ కు ఎటువంటి సంబంధం లేనట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో యువత ఎక్కువగా కలవడాలు.. ఎక్కడ పడితే అక్కడ తిరగడాలు చేస్తూ ఉంటారు కాబట్టి.. వారిని అదుపు చేయడానికి అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకకు వైన్ షాప్ ల విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు పెట్టినట్లు కనిపించడం లేదు. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ మద్యం దుకాణాలనన్నింటినీ మూసివేస్తారన్న ప్రచారం జరిగింది. మద్యపానానికి వ్యతిరేకమైన ప్రభుత్వం ఆదాయం గురించి పట్టించుకోకుండా.. ఆ పని చేస్తుందని అనుకున్నప్పటికీ. మద్యం దుకాణాలు మూసివేయడం, సమయాలను తగ్గించడం చేయలేదు.కొత్త సంవత్సర వేడుకలకు యధావిధిగా తెరుచుకోనున్న మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకుంటాయనే తెలుస్తోంది. దుకాణాలు, బార్లపై నిషేధం లేదని.. మద్యం దుకాణాలు రాత్రి తొమ్మిది గంటల వరకు, బార్లు రాత్రి పది గంటల వరకూ ఉంటాయని తేల్చి చెప్పింది. న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేద్దామని ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని అనుకుంటున్న వాళ్లకు ఈ వార్త కాస్త గుడ్ న్యూస్ గానే అనిపిస్తోంది. ఉన్న బ్రాండ్లతోనే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. తమ ప్రభుత్వానికి మద్యం ఆదాయ వనరు కాదని చెబుతూ వస్తున్న ప్రభుత్వం.. మద్యం దుకాణాల సమయాన్ని పెంచడం. రేట్లు తగ్గించడం వంటి పనులు చేసింది.
511 Total Views, 2 Views Today