AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పట్టుదలే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది విజయనగరం ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్ర…

1 min read

AABNEWS :పట్టుదలే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది
విజయనగరం ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి ఆర్మ్డ్ ఫోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన ఔత్సాహిక యువకులు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కృషి
చేయాలని ఆర్మ్డ్ రిజర్వు డిఎస్పీ ఎల్.శేషాద్రి మార్చి 18, గురువారం నాడు యువతకు పిలుపునిచ్చారు. అయ్యన్న పేట కోనేరు
పార్కులో యువతకు స్ఫూర్తినిచ్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి ముఖ్య అతిధిగా
హాజరై, మాట్లాడుతూ – యువత లక్ష్యం సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోను విశ్రమించకూడదన్నారు. ఇటీవల కాలంలో
ప్రభుత్వం భారీగా పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధపడుతుందన్నారు. అందుకు యువత అన్ని విధాలుగా
సిద్ధం కావాలన్నారు. ఒక్క శారీరక ధారుడ్య పరీక్షలకు మాత్రమే సిద్ధం కావడం కాకుండా, వ్రాత పరీక్షకు కూడా
సమాంతరంగా సిద్ధం కావాలన్నారు. ఉద్యోగం సాధించాలనే తపన ఉంటే తప్పక విజయం సాధిస్తామని, అందుకు శ్రమ
పడడం ఒక్కటే మార్గమన్నారు. పోలీసుశాఖలో పని చేస్తున్న బాసిన చంద్రశేఖర్ యువతను సన్మార్గంలో నడిపించాలనే
లక్ష్యంతోనే శ్రీ హనుమాన్ ఉచిత శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేసి, యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రతీ
ఒక్కరూ శేఖర్ నిర్దేశించిన విధంగా క్రమశిక్షణతో సాధన చేయాలని, కొద్ది రోజుల్లో పోలీసుశాఖ చేపట్టే ఉద్యోగాల్లో ఎక్కువ
శాతం ఉద్యోగాలను ఈ కోచింగు సెంటరులో సాధన చేస్తున్నవారే సాధించాలని ఆకాంక్షించారు. ఎటువంటి సౌకర్యాలు
లేనిమారుమూల గ్రామాల నుండి వచ్చిన తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని, అవాంతరాలను అధిగమించి, ఎంతో శ్రమించి
పోలీసుశాఖలో చేరి, ఈ రోజు డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నానన్నారు. లక్ష్యం సాధించాలన్న కోరిక ఎంత బలంగా ఉంటే
అంత మంచి ఫలితాలను సాధించవచ్చునని, అనవసర విషయాలకు ప్రాధాన్యతను తగ్గించి, విజయం సాధించేందుకు ప్రతీ
ఒక్కరూ కృషి చేయాల్సిందిగా ఎఆర్ డిఎస్పీ యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాన్నిచ్చారు. ఇటీవల పోలీసుశాఖ నిర్వహించిన
పింక్ థాన్ పరుగులో రాణించిన ఆదిలక్ష్మి, కోచింగు సెంటరులో శిక్షణ పొందుతున్న లావణ్యలను ప్రోత్సహించేందుకుగాను
ఎఆర్ డిఎస్పీ ఇరువురికి స్పైకులను ఉచితంగా ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి అందజేసారు.
అనంతరం, పోలీసుశాఖకు విశేషమైన సేవలందించి, పోలీసు కార్యాలయ ప్రాంగణాన్ని ఎంతో సుందరంగా మొక్కలు
ను పెంచి, ఎంతో ఆహ్లాదకర వాతావరణంను నిర్మించిన ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రిని శిక్షణ పొందుతున్న యువత ఘనంగా
గజమాల, సాలువతో సత్కరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు పిఆర్వో పి. కోటేశ్వరరావు,
ఎస్పీని స్కూల్స్ సమన్వయకర్త బి. చంద్రశేఖర్, శిక్షణ పొందుతున్న ఔత్సాహిక యువకులు, యువతులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.

 131 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.