పత్రికలు సమాజ శ్రేయస్సు కై పాటు పడాలి…
1 min read
AABNEWS : పత్రికలు సమాజ శ్రేయస్సు కై పాటు పడాలి: దవులూరి ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి సమాజ అభివృద్ధికి పత్రికలు పాటు పడాలని పెద్దాపురం నియోజక వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ దవులూరి దొరబాబు గారు అన్నారు.శుక్రవారం ఉదయం పెద్దాపురం నియోజక వర్గం చిన్నతిరుపతి లోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దర్శనం అనంతరం చంద్రమాంపల్లి గ్రామంలో సంచలన తెలుగు దిన పత్రిక అక్షర””లీడర్””2021 ప్రత్యేక కేలెండర్ ను దవులూరి దొరబాబు గారు ఆవిష్కరించారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ విలువలతో,విశ్వసనీయత తో ఎడిటర్ జయ సారాజ్యంలో అక్షర లీడర్ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఉన్నతమైన అసయాలతో, సేవే లక్ష్యంగా సమాజ శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తూ దవులూరి దొరబాబు గారు కేలెండర్ ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని,ఆయన కోరినట్లు గానే పత్రిక ను విలువలతో ముందుకు నడిపిస్తామని ఎడిటర్ జయ అన్నారు.ఈ సందర్బముగా దవులూరి దొరబాబు గారికి,ఎలిశెట్టి నరేష్ గారికి,పెద్దాపురం మండల వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు,అక్షర లీడర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
152 Total Views, 2 Views Today