AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పవన్ కళ్యాణ్‌కి కరోనా నెగెటివ్…

1 min read

AABNEWS : మూడ్రోజులుగా కరోనాతో బాధపడుతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు రిపోర్ట్ నెగటివ్ వచ్చినట్లు తెలిసింది. మూడ్రోజుల కిందట పవన్ కళ్యాణ్‌కి అస్వస్థతగా అనిపించడంతో… టెస్టు చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో… హైదరాబాద్‌ దగ్గర్లోని తన వ్యవసాయక్షేత్రంలో డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకున్నారు. జ్వరంతోపాటు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయనకు యాంటీ వైరల్‌ డ్రగ్స్, అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ ఇచ్చారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. అన్నట్లుగానే ఆయనకు తాజాగా కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో… ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 366 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.