AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాజిటీవ్ వ్యక్తులు రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు : అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి…

1 min read

AABNEWS : కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వక్తులు రోడ్లపైన తిరిగితే చర్యలు తప్పవని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి ఐపీఎస్ అన్నారు. బుధవారం ఆయన మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూమధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు 6గంటల వరకు జరుగుతున్న కర్ఫ్యూ పూర్తిస్థాయిలో అమలవుతుందని, 12 గంటల తరువాత వ్యాపార సముదాయాలు, ప్రజలకు అనుమతి లేదని అన్నారు. అత్యవసర సందర్భాల్లో వెళ్లే ప్రజలు, ప్రభుత్వం జీఓ ప్రకారం అనుమతించిన కేటగిరి వ్యక్తులు మాత్రమే సరైన అనుమతి పత్రాలతో బయటకు రావాలని సూచించారు. అనవసరంగా తిరిగే వ్యక్తుల పై 188 ఐపీసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని అన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో రోజుకు సుమారు 150 నుండి 200 వాహనాలు సీజ్ అవుతున్నాయని, వాటిలో 90 శాతం ద్విచక్ర వాహనాలు, 10 శాతం కార్లు ఉన్నట్లుగా చెప్పారు. ప్రజలందరూ కర్ఫ్యూకి సహకరిస్తున్నారని, కొంతమంది ఆకతాయిలు వాకింగ్ పేరుతో సాయంత్రం సమయాల్లో సంచరిస్తున్నారని, అలానే వాకింగ్ చేసేవారిపైనా కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. సడలింపు ఇచ్చిన సమయం విచ్చల విడిగా తిరిగేందుకు కాదని ఆ సమయంలో అత్యవసరమైతే, లేదా నిత్యావసరాలకి మాత్రమే వచ్చి ఇండ్లకి వెళ్లాలని అన్నారు.అంతేకాకుండా కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వ్యక్తులు క్వారంటైన్ లో ఉండకుండా వైద్యం కోసం తిరుగుతున్నట్లు గుర్తించామని అన్నారు. అటువంటి వ్యక్తులు వైద్యుల సూచనల మేరకు ఇన్ఫెక్షన్ శాతాన్ని బట్టి హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రులలో మాత్రమే ఉండాలని కోవిడ్ కి వైద్యం కోసం ఆసుపత్రులకు రోజు తిరగటం అనేది చట్టవ్యతిరేకమైన చర్య అని అన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అలానే ఇటువంటి వారికోసం గుంటూరు అర్బన్ జిల్లాలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చూడతున్నామని, పోలీస్ చెక్ పోస్టుల వద్ద అంబులెన్స్ లని, పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని, పాజిటీవ్ వచ్చిన వ్యక్తుని తనికీల్లో గుర్తిస్తే అంబులెన్స్ లలో ఎక్కించి క్వారంటైన్ కి పంపుతామన్నారు.ప్రజలు పోలీస్ ల కష్టాన్ని గుర్తించాలని ఇప్పటికే అర్బన్ పరిధిలో 190 మంది సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారని, ప్రజలకి సేవ చేసే క్రమంలోనే వారు వైరస్ బారిన పడుతున్నారని అన్నారు. ప్రజలు కర్ఫ్యూకి పూర్తి స్థాయిలో సహకరించినప్పుడే కోవిడ్ అంతమవుతుందని అన్నారు. అలానే అనుమతి లేకుండా కోవిడ్ కు చికిత్స చేసే ఆసుపత్రులు పైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు….

 1,839 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.