September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాపులర్ ఫ్రంట్ డే న జరిగిన పతాక ఆవిష్కరణ మరియు బ్లడ్ డొనేషన క్యాంప్…

1 min read

AABNEWS : స్థానిక బారా షహీద్ దర్గాలో పాపులర్ ఫ్రంట్ పతాక ఆవిష్కరణ జరిగింది తదనంతరం బ్లడ్ డొనేషన క్యాంప్ నిర్వహించటం జరిగింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులు అడ్వకేట్. సయ్యద్ కాషిఫ్ పాపులర్ ఫ్రంట్ డే సందర్భంగా పాపులర్ ఫ్రంట్ పతాకాన్ని ఆవిష్కరించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా 2007 కు ముందు దక్షిణాది కేరళ ,కర్ణాటక ,తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ లో వివిధ పేర్లతో సేవ కార్యక్రమాలు నిర్యహిస్తున్న సంస్థలు 2007 లో ఏకమై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో నేషనల్ సోషల్ యాక్ట్ క్రింద రిజిస్టరై దేశవ్యాప్తంగా దేశప్రజల సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తు 4 రాష్ట్రల నుంచి ఇప్పుడు 23 రాష్ట్రాలలో సేవ కార్యక్రమాలను నిర్విహిస్తుంది. దేశప్రజల సాధికారత కోసం శ్రమిస్తు దేశప్రజల మరియు రాజ్యాంగ రక్షణ కోసం నిలబడి పోరాటం చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ను అడ్డుకోవాలని మరియు అంతం చేయాలని దేశంలోని రాజ్యాంగ వ్యతిరేక సంస్థలు ఎన్నో కుట్రలు చేయటం జరిగింది .ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన పాపులర్ ఫ్రంట్ భయపడదని ఒక్క అడుగు కూడా వెనుకకు వేసే ప్రసక్తేలేదని తెలిపారు. ఇప్పుడు పాపులర్ ఫ్రంట్ కు ప్రజాధారణ ప్రతిదినము పెరుగుతుందని .దేశప్రజలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ను తెలుసుకొని పాపులర్ ఫ్రంట్ కు తోడుగా నిలబడుతున్నారని .అతి త్వరలో దేశంలో ని ప్రతి భారతీయునికి ఎవరు ప్రజల కోసం ,రాజ్యాంగ రక్షణ కోసం మరియు ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నారో ఎవరు దేశాన్ని అమ్మి ,లూటీ చేసి దేశప్రజల మరియు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అర్ధమయ్యే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. పతాక ఆవిష్కరణ అనంతరం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బ్లడ్ డొనేషన క్యాంప్ ను కార్యకర్తలు మరియు ప్రజలు విజయవంతం చేశారు. బ్లడ్ డొనేషన కార్యక్రమంలో 23 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో NCHRO రాష్ట్ర ఉపాధ్యక్షులు అడ్వకేట్ అన్వర్ బాషా గారు SDPI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ముహమ్మద్ గని గారు ,ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు హాఫిజ్ అబ్దుల్ అజీజ్ మరియు కార్యదర్శి హాఫిజ్ ఖలీల్ అహ్మద్ గారు పాల్గొన్నారు.

 982 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.