పునరావాసకేంద్రాలకు తరలింపు…
1 min read
AAB NEWS : నీవర్ తుఫాన్ ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించిన తరువాత ప్రభుత్వ యంత్రంగం అప్రమత్తం అయింది. కట్టువపల్లి గ్రామంలో కి ఈరోజు MPDO గారు, మండల స్పెషల్ ఆఫీసర్ గారు , MRO గారు, SI గారు,మండల వైస్సార్సీపీ నాయకులు కడివేటి చంద్రశేఖర్ గారు , హరగోపాల్ రెడ్డి గారు, పంచాయితీ సెక్రెటరీ గారు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, గ్రామంలోని ST కాలనీ ని సందర్శించి వారు నివసిస్తున్న ప్రదేశం సురక్షితం కాదు అని తెలియచేసి వారిని నివాసప్రాంతాలకు వెళ్లాలని తెలియచేసారు. దీంతో గ్రామంలోని వైస్సార్సీపీ యువనేత, చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ గుండాల ఆదినారాయణ గారు, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు శ్రీ సన్నారెడ్డి జానకీరామిరెడ్డి గారు ప్రత్యక శ్రద్ధతో వారికి తుఫాన్ పై అవగాహనను కల్పించి వారందరిని పునరావాసకేంద్రాలకు తరలించారు. గుండాల ఆదినారాయణ గారు సచివాలయ ఉద్యోగులను కలిసి, తూఫాన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు నివారణ చర్యలను తెలియచేసారు. గ్రామంలోని చెరువులను సందర్శించి, నీటి నిల్వను పరిశీలించారు.నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ప్రజలను అప్రమత్తం చేసి, యువత ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలియచేసారు.
22 Total Views, 2 Views Today