AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెంపుడు జంతువు కోసం ప్రాణాల్ని సైతం లెక్కచేయని వ్యక్తి…

1 min read

AABNEWS : మనుషుల కంటే కుక్కలకే ఎక్కువగా విశ్వాసం ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం మనుషులకు కూడా కుక్కలకు ఉండే విశ్వాసం ఉంటుందని ఈ వీడియో చూస్తే మనిషికి కూడా ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుంది అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చూడటానికి నిరుపేదలా కనిపించే ఒక వ్యక్తి తన దగ్గరున్న ఒకే ఒక మాస్క్‌ను తాను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే తన పెంపుడు కుక్కకు ఇచ్చేశాడు అంటే అర్ధం అవ్వడం లేదా.. ఆ వ్యక్తి తన కుక్కని ఎంతలా ఇష్టపడుతున్నాడో అనే విషయం.కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోకపోయినా ఈ కుక్క మాత్రం తన కష్టాల్లో, సంతోషాల్లో తోడుందేమో గానీ దాని కంటే విశ్వాసంగా ఈ యజమాని ప్రవర్తించాడు. కరోనా భయంతో ఎవరికి వారు తమ ప్రాణాలకు ముప్పు రాకుండా జాగ్రత్తపడుతుంటే ఇతను మాత్రం తన ప్రాణం పోయినా ఫర్వాలేదు నా కుక్క బతికుండాలని కోరుకుంటున్నాడు. ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో కూడా హృదయాన్ని కదిలించే సన్నివేశం ఉంది.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చూడటానికి పేద కుటుంబానికి చెందినట్లుగా ఉన్న పెద్దవయసు వ్యక్తి ఒకరు,తన భుజాల మీద ఒక కుక్కను ఎత్తుకుని వెళ్తున్నాడు.అలాగే ఆ శునకం మూతికి మాస్క్ వేసి ఉంది. కానీ ఆ కుక్కని ఎత్తుకుని ఉన్నా వ్యక్తి మాత్రం మాస్క్ లేదు . ఈ వీడియో తీసిన వ్యక్తి దీని గురించే అడుగుతాడు. కుక్క పేరు ఏంటి అంటే గురూ అని చెబుతాడు. అలాగే కుక్కకి మాస్క్ వేసి, నువ్వెందుకు వేసుకోలేదని అడుగుతాడు. ఆ బాటసారి హిందీలో సమాధానం చెబుతూ, `ఇది నా బిడ్డ. నాకు ఏం జరిగినా ఫర్వాలేదు గానీ వీడికి మాత్రం ఎలాంటి హానీ జరగకూడదు` అంటాడు. నేను చచ్చిపోయినా, నా కుక్కను మాత్రం చచ్చిపోనివ్వను` అనే ఇతని మాటలు మనసుకు హత్తుకుంటున్నాయి.పెంపుడు జంతువుల పట్ల ఇతను చూపించే ప్రేమ పట్ల అందరు ఆకర్షితులవుతున్నారు..

 1,093 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.