అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుక…
1 min read
AABNEWS : అంబేద్కర్ యువజన సంఘం(శ్రీరామగిరి) ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
యూత్ అధ్యక్షులు మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ బాబాసాహెబ్ డా”BR అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరునిపై ఉంది.
ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వతంత్రలతో జీవిస్తున్నాడు అంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారానే అన్నారు.
కానీ భారత రాజ్యాంగాన్ని కొంతమంది మతవాదులు మనువాదులు కించపరుస్తూన్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ డోనికానీ జ్యోతి గారు, PSCS శ్రీరామగిరి మార్కెట్ చైర్మన్ గుండా వెంకన్నగారు,
ఉప సర్పంచ్ గంజి గోవర్ధన్ గారు,
స్కూల్ HM పద్మావతి గారు,స్కూల్ చైర్మన్ బందు రాములు గారు గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ అధికారులు అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
174 Total Views, 2 Views Today