AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పేద మహిళ అంత్యక్రియలకు అవసరమయ్యే 10,000 వేల రూపాయల నగదును అందజేసిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులునాయుడు…

1 min read

AABNEWS :పేద మహిళ అంత్యక్రియలకు అవసరమయ్యే 10,000 వేల రూపాయల నగదును అందజేసిన “రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులునాయుడు చిల్లకూరు దళితవాడలో ఆవుల వెంకటమ్మ అనే 55 సంవత్సరాల మహిళ నివాసం ఉంటుంది.ఈమె గత కొంత కాలం నుండి కాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.ఆమె భర్త ఆవుల వెంకటయ్య 2.సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు.కూలి పనులకు వెళ్తే గాని పూట గడవని పరిస్థితి ఆమెది.వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటుంది.లివర్ బాగా దెబ్బతినటంతో సోమవారం రాత్రి మరణించింది.ఉండవలసిన వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఆధార్ కార్డులో 71సం”నమోదు అయి ఉండడంతో ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం ఆమెకు అందకుండా పోయింది.అంత్యక్రియలు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతుండ డంతో గ్రామస్తులు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులునాయుడుకి తెలియజేశారు.ఆయన వెంటనే స్పందించి పేద మహిళ అంత్యక్రియలకు అవసరమయ్యే పదివేల రూపాయలను గ్రామస్తులు చేతుల మీదుగా ఆమె కుమార్తెకు అందజేశారు.అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం మరణించిన ఆమె భర్త వెంకటయ్య అంత్యక్రియలకు కూడా పదివేల రూపాయలను అందజేశారు.కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా ఆపదలో ఉన్న వారినెందరినో ఆపద్బాంధువుడిలా ఆదుకుంటున్న రాజమేని శ్రీనివాసులునాయుడిని గ్రామ ప్రజలు అభినందించి,ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీపతి రమేష్ బాబు.కొట్టు వెంకట రమణయ్య.వరదయ్య తదితరులు పాల్గొన్నారు.

 1,100 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.