AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పోలవరం పనులను సందర్శించిన సీఎం..

1 min read

AABNEWS : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం ఉదయం పోలవరం వద్దకు చేరుకున్న సీఎం.. తొలుత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఆ తరువాత ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనుల జరుగుతున్న తీరును పరిశీలించారు..ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు పనుల జరుగుతున్న తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఆ తరువాత స్పిల్ వే వద్దకు చేరుకుని పనుల పురోగతిని సీఎం జగన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. 2022 ఖరీఫ్ నాటిని పోలవరం నుండి నీటిని అందిస్తామన్నారు.ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి పునరావాసం అమలు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

 120 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.