ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కుటుంబ సభ్యుడు…
1 min read
AABNEWS : ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కుటుంబ సభ్యుడు ధనంజయ రెడ్డి గారి సహాయ సహకారాలతో జనవరి 17 వ తేదీన రాత్రి 11 గంటలకు సంక్రాంతి సంబరాలు లో భాగంగా షటిల్ టోర్నమెంట్ NGO హోమ్ నందు ఘనంగా నిర్వహించబడింది. గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్-1 పరిధిలోని ఓపెన్ టు ఆల్ విభాగంలో 44 జట్లు క్రీడాకారులు పాల్గొన్నారు.దీనికి ముఖ్య అతిధులుగా వచ్చిన గూడూరు సి.ఐ దశరథ రామారావు మరియు మైథిలి హాస్పిటల్ అధినేత రమణ బాబు గారి చేతుల మీదుగా విన్నర్స్ గా నిల్చిన సూరి, ఇంతియాజ్ మరియు రన్నర్స్ గా నిల్చిన జమీల్,చంద్ర కు మరియు 3rd ప్లేస్,4th ప్లేస్ కు మరియు బెస్ట్ ఎఫెన్స్ ప్లేయర్ గా చిల్లకూరు రెయిన్ డ్రాప్ జట్టుకు సంబంధించిన అశోక్ కుమార్,బెస్ట్ డిఫెన్స్ ప్లేయర్ గా S.K.R టీమ్ కు సంబంధించిన నిరంజన్ కు షీల్డ్ మరియు మెడల్స్ ను బహూకరించడం జరిగింది.మరియు సీడెడ్ క్రీడాకారుల విభాగంలో విన్నర్ గా నిల్చిన రూపేష్, సాయి మరియు రన్నర్స్ గా నిల్చిన నాగార్జున, సుజిత్ కు షీల్డ్ మరియు మెడల్స్ ను బహూకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం, సీనియర్ షటిల్ క్రీడాకారులు ఐతా శ్రీహరి,నాగేందర్ రెడ్డి, ఎంపైర్ గా నిర్వహించిన పి.డి. వెంకటేశ్వర్లు గారు,ప్రగతి కుటుంబ సభ్యులు పి.డి. కరిముళ్ల, గ్రానైట్ ప్రభాకర్,పిల్లిలా శీను, జయపాల్ రెడ్డి, వాచ్ షాప్ రాము,తానూజ్,కో ఆర్డినేటర్ సతీష్,P.E.T లు తదితరులు పాల్గొన్నారు.
52 Total Views, 2 Views Today