ప్రభుత్వం చేతకాని తనం రోజుకు ఓ హత్య ఆడపిల్లకు రక్షణ ఇవ్వలేని ఏపీ ప్రభుత్వం…
1 min read
AABNEWS : అనంతపురం జిల్లా ధర్మవరం మండలం లో దారుణం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో కాంట్రాక్టు పద్దతి లో ఉద్యోగం చేస్తున్న యువతి స్నేహలత మంగళవారం బ్యాంకు కి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు దాంతో తల్లితండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. బుధవారం తెల్లవారుజామున ధర్మవరం మండలం బండన్నపల్లి దగ్గర పోలీస్ లు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. స్నేహలత ను దుండగులు అతిదారుణంగా పెట్రోల్ పోసి కాల్చి చంపారు.స్నేహలత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు ఆమె రాజేష్ మరియు కార్తీక్ అనే ఇద్దరు ప్రేమ పేరుతొ తమ కూతుర్ని ఇబందిపేటవారు అని తల్లి ఆరోపించారు. స్నేహలత పోలీస్ లకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించోకోలేదని ఆమె తల్లి ఆరోపించారు.చివరికి తన ప్రాణం కోల్పోయిన యువతి ఇపని చేసిన వాళ్ళు ఎవరైనా కఠినంగా శిక్షించాలి. అని ఆమె తల్లి ఆరోపణచేసారు. దిశా చట్టం ప్రకారం శిక్షించాలి అని ఆరోపించారు .
228 Total Views, 2 Views Today