AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటున్న ఆశా,లు …

1 min read

AABNEWS : ఆశా కార్యకర్తల జాతీయ సమ్మెలో భాగంగా సోమవారం రోజు నారాయణపేట జిల్లా ఆస్పత్రి ఆవరణలో ప్లేకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసనలో ఆశకార్యకర్తలనుద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్ మాట్లాడుతూ ప కనీసంవేతనం నెలకు 21 వెయ్యి రూపాయలు ఇవ్వాలని
పీఎఫ్ ,ఇఎస్ఐ ,పిపిఈ కిట్లు,శానిటైజర్లు తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తలు కరోనా నియంత్రణలో అహర్నిశలు పని చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు
కరోనా రోగులకు వైద్యసేవలు అందించే సమయంలో ఆశా కార్యకర్తలు ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారని అయితే ప్రభుత్వం మాత్రం వారికి ఉచిత వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు
కరోనా బారిన పడి మరణించిన ఆశా కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు
కరోనా ఉద్రుతంగా కొనసాగుతున్న ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నాయని విమర్శించారు
దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా టీకా ఉచితంగా వేయాలన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు
హాస్పిటల్లో ఆక్సిజన్ అందక, బెడ్స్ దొరకక ఎంతోమంది ప్రాణాలు వదులు తున్నారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలే తప్ప మరొకటి కాదని విమర్శించారు
ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు
అనంతరం వివిధ డిమాండ్ల తో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అసంక్రమిత వ్యాధుల నిరోధక అధికారి డా.సిద్ధప్ప గారికి వినతి పత్రం అంద జేశారు
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బాలమణి, విజయలక్ష్మి, భాగ్యమ్మ,రషీదా, స్రవంతి,కృష్ణవేణి,ఉమా, సావిత్రమ్మ, బాల్ నర్సమ్మ,అనిత కరణమ్మ,మమత,తదితరులతో పాటు 40మంది పాల్గొన్నారు.

 2,003 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.