ప్రొద్దుటూరు లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగటంతో ప్రొద్దుటూరు…
1 min read
AABNEWS : ప్రొద్దుటూరు లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగటంతో ప్రొద్దుటూరు పట్టణం లోని పద్మశాలి కల్యాణ మండపం లో తెలుగుదేశం పార్టీ 41 వార్డ్ లలో కౌన్సిలర్స్ అభ్యర్థుల తో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చల పుల్లయ్య, రాష్ట్ర ముస్లిం మైనారిటీ వి.ఏస్ ముక్తియార్, పట్టణ అధ్యక్షుడు ఇ. వి సుధాకర్ రెడ్డి, బొర్రా రామాంజనేయులు, లక్ష్మీ ప్రసన్న, కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోట శ్రీ దేవి, T.N.S.F కుతుబుద్ధిన్, సీతారామిరెడ్డి, గారు మాట్లాడుతూ మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని,వైకాపా చేస్తున్న అరచకాలను,అక్రమాలను, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను వివరిస్తూ,అరాచక పాలనను ప్రజలకు వివరించాలని నాయకులకు,కార్యకర్తలకు సూచించారు.వైకాపా ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నా, పెంచిన ఇంటి పన్నుల ధరలపై పోరాటం చెయ్యాలన్నా మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

334 Total Views, 2 Views Today