ఫీజు బకాయిలు విడుదల చేయాలి, సేవలాల్ సేవాసమితి…
1 min read
AABNEWS : పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు తక్షణం విడుదల చేయాలని కళ్యాణదుర్గం పట్టణంలో సేవాలాల్ సేవా సమితి కార్యాలయంలో సేవాలాల్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రామావత్ చందు నాయక్….. మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ఎన్నిమార్లు ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం అని అన్నారు, ఇప్పటికే జిల్లాలో కరువుతో ఒకవైపు కరోనాతో ఒకవైపు ప్రజలంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు విడుదల కాలేదని విద్యార్థులు పూర్తి స్థాయిలో ఫీజులు కట్టాలని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాయని, ఇంత జరుగుతున్నా అధికారులు, రాష్ట్రప్రభుత్వం చూసీచూడనట్లు ఉండడం చాలా బాధాకరమన్నారు, విద్యకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు, అతి తొందర్లోనే, పీజీ మరియు ఇతర కోర్సుల కౌన్సిలింగ్ నిర్వహణ జరిగే అవకాశాలు ఉన్నాయని అంతలోపు విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు విడుదల చేయకపోతే విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వ విద్యాలయాల్లో సైతం ఫీజు రియంబర్స్మెంట్ పడలేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధింపులకు గురి చేసేటువంటి సందర్భాలు మునుపెన్నడూ చూడలేదని అన్నారు, పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులను చదువులకు దూరం చేసే దిశగా ఈ రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వ్యవహార శైలి కనబడుతోందని అన్నారు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా పై తరగతులకు వెళ్ళి చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తక్షణం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మారుతి నాయక్ ప్రవీణ్ కొల్లాయి ఆంజనేయులు నాయక్ తదితరులు పాల్గొన్నారు
36 Total Views, 2 Views Today