AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆన్లైన్ మోసాలను నమ్మవద్దు డిఎస్పీ శ్రీనివాస రావు…

1 min read

AAB NEWS : బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. బ్యాంక్ మోసాలు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు బ్యాంకు మోసాలు విపరీతంగా జరుగుతున్నాయని చదువుకొని వారు చదువుకున్న వారు కూడా ఇటువంటి మోసాలకు గురై బాధితులు అవుతున్నారని బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామని మీ ఫోన్ కి ఓటిపి వస్తుంది చెప్పండి అని లేకపోతే మీ కార్డు బ్లాక్ అవుతుందని ఇలా చెప్పడం వలన ఇది నిజమని నమ్మి పూర్తి సమాచారాన్ని వారికి తెలియ పరచడంతో బ్యాంకులో మీ అకౌంట్ లో ఉన్న నగదు మొత్తాన్ని దోచేస్తున్నారని డిఎస్పీ అన్నారు. బ్యాంకుల నుండి గాని ఫోన్ కాల్స్ వస్తే వాటిని నమ్మకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇటువంటి తరహా మోసాలకు ప్రజలు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని అని డీఎస్పీ తెలిపారు. ఫేస్బుక్ ఫేస్బుక్ లో కూడా అకౌంట్ ను హ్యాక్ చేసి మేము ప్రమాద స్థితిలో ఉన్నామని అర్జెంటుగా 10 వేలు డబ్బులు పంపమని మెసేజ్లు పంపుతున్నారని అటువంటి వాటిని కూడా నమ్మవద్దని డిఎస్పీ అన్నారు. ఏటీఎం ఏటీఎం దగ్గర కూడా డబ్బులు తీసి ఇవ్వమని కార్డు వేరే వాళ్లకు ఇస్తే నగదు తీసిన తర్వాత కార్డు మార్చేసి మరొక కార్డును ఇస్తున్నారని తర్వాత అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం డ్రా చేసుకుంటున్నారని ఏటీఎంల వద్ద కూడా ఎవరికి పడితే వారికి కార్డు ఇవ్వరాదని డిఎస్పీ తెలిపారు. దిశ యాప్ దిశ యప్ ప్రతి ఒక్క మహిళ డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఎస్ఓఎస్ బటన్ నొక్కితే పోలీసు వారు వెంటనే స్పందించి దుండగుల నుండి ఆపదలో ఉన్న మహిళలను రక్షించడానికి దిశ యాప్ తోడ్పడుతుందని యువత డౌన్లోడ్ చేసుకోవాలని డి.ఎస్.పి తెలిపారు. మీడియా సమావేశంలో పట్టణ సిఐ పి కృష్ణయ్య ,రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి ,పట్టణ ఎస్ఐ రఫీ, రాంబాబు, రూరల్ ఎస్సై వెంకట ప్రసాద్ ,కర్లపాలెం ఎస్ఐ అంజయ్య, ఉన్నారు

 59 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.