AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైసీపీ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి…

1 min read

AAB NEWS : ఈ రోజు బాపట్లలో మండల రెవిన్యూ కార్యాలయం లో తహశీల్దార్ కె శ్రీనివాస్ గారికి వినతిపత్రం అందజేస్తూ వైసీపీ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లా రామయ్య మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గం లో కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలలో 18 సం,, లు నిండినవారు సుమారు 5011 మంది వికలాంగులు ఉన్నారని,ఆయా సచివాలయ పరిధిలో వున్న డాక్టర్లు వికలాంగుల కోసం కొంచెం చొరవ తీసుకుని ఏఎన్ఎం ల ద్వారా టీకాలు వేయించాలని కోరుతూ మండల తహశీల్దార్ కె శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది అని, దానికి తహశీల్దార్ గారు వెంటనే స్పందిస్తూ త్వరలోనే వికలాంగులకు అందరికీ ఈ నెల 21 వ తేదీ తర్వాత నుంచి క్యాంపులు నిర్వహించ్ టీకాలు అందజేసే కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారని, అందుకు తహశీల్దార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపుతున్నానని అన్నారు.

అలాగే ఈ వికలాంగుల సమస్యను గౌరవనీయులైన బాపట్ల శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారి దృష్టికి తీసుకునిపోయి వెంటనే సమస్యను పరిష్కరించేలా చేస్తానని, అలాగే వికలాంగుల సోదరులు ఎవరూ కూడా టీకాలు విషయంలో కంగారు పడాల్సిన పనిలేదని, అందరికీ టీకాలు అందుతాయని ధీమాగా ఉండండని ఈ సందర్భంగా చల్లా రామయ్య మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గుంజి ఏడుకొండలు,జిల్లా సెక్రెటరీలు సొంగా వీరయ్య, బాపట్ల మండల అధ్యక్షులు కట్టా రవి మరియు వైసీపీ నాయకులు కాగిత రవి తదితరులు పాల్గొన్నారు

 140 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.