AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బాలికకు తాళి కట్టేందుకు యత్నం…

1 min read

AABNEWS : రాయవరం: పదోతరగతి విద్యార్థినికి ఓ యువకుడు తాళికట్టేందుకు యత్నించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఏఎస్సై పి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..అనపర్తి మండలంలోని మహేంద్రవాడకు చెందిన పదోతరగతి బాలిక యథావిథిగా పాఠశాలకు హాజరైంది. తరగతులు ప్రారంభం కాకముందే అనపర్తి మండలంలోని కొప్పవరానికి చెందిన సత్తి శివారెడ్డి(23) అనే యువకుడు మైనర్‌ బాలికకు తాళి కడతానంటూ తరగతిలోకి ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన విద్యార్థులు, బాలిక తమ్ముడు కేకలు వేస్తూ యువకుడిని అడ్డుకుని నెట్టివేశారు. కేకలు విని ఉపాధ్యాయులు రావడం గమనించిన యువకుడు తాళిబొట్టును పడేసి ద్విచక్రవాహనంపై పారిపోయాడు. సమాచారం అందుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికనే వివాహం చేసుకుంటానంటూ యువకుడు గత రెండు నెలలుగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దలు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులకు బాలిక తండ్రి తెలిపారు. పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సదరు యువకుడు బాలిక ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్నకు యత్నించాడు. స్థానికులు రాయవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

 152 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.