AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భయపడవద్దుజాగ్రత్తలే ముఖ్యం. గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు చిన్నయ్య పడాల్…

1 min read

AAB NEWS : చింతపల్లికరోనా భయంతోనే ప్రజలు అనేక మంది మృత్యువాత పడుతున్నారని, కరోనా పై కొన్ని జాగ్రత్తలు, ప్రాథమిక అవగాహన అవసరమని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బోనంగి చిన్నయ్యపడాల్ అన్నారు. సోమవారం ఆ సంఘం జిల్లా కమిటీ శారద ట్రస్ట్ అల్లూరి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ముద్రించిన కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే కరపత్రాలను మండల కేంద్రంలో విస్తృతంగా పంపిణీ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం గ్రామాలలో అవగాహన కల్పించలేదని ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ పై 9 రకాల కారణాలు చెపుతున్నారన్నారు. అటువంటి లక్షణాలు ఏ ఒక్కటి ఉన్న ప్రజలు భయపడి పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముందు మన నుండి భయాన్ని తొలగించుకోవాలని ఆయన సూచించారు. ఏజెన్సీలో ఆక్సిజన్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఏజెన్సీలో రోజూ ఏదో ఒక మండలంలో కరోనా వైరస్ తో ఎవరో ఒకరు మరణిస్తుంటే పాడేరు డివిజన్ పరిధిలోని ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవలసిన ఐటీడీఏ పీవో ను విశాఖపట్నం కేజిహెచ్ కోవిడ్ సెంటర్ కి ప్రధాన బాధ్యతల్లో నియమించడం వెనుక గిరిజనులను నిర్లక్ష్యం చేయడమేనా? అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఐటీడీఏ పీవోను కేజీహెచ్ లోని బాధ్యతల నుంచి తప్పించి ఏజెన్సీలోని బాధ్యతలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రముఖ వైద్య సిబ్బంది యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈ కరపత్రాన్ని ముద్రించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ చదివి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు పాంగి జీవన్ పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.

 109 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.