భర్త ఇంటి ముందు బైఠాయింపు…
1 min read
AABNEWS : దోర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన అబ్దుల్ ఖయ్యుమ్ కుమారుడు అబ్దుల్ సత్తార్ కి బేతంచర్ల మండలానికి జహురున్నీసాతో 2015 వ సం”వివాహం అయినది. వివాహ సమయంలో 1లక్ష రూపాయలు, 6 తులాల బంగారు కట్నంగా తీసుకొని , వివాహం అయిన తర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుండి ఆమెను మానసికంగా , శారీరకంగా వేధించి, ఉరివేసి చంపే ప్రయత్నం చేస్తే తాను తప్పించుకుని తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తే , చాకరాజువేముల గ్రామ పెద్దలు పంచాయితీ చేసి అబ్బాయి వైపే మాట్లాడంతో అక్కడ జహురున్నిసాకి న్యాయం జరగలేదని యస్సి, యస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్య వేదిక ను ఆశ్రయించింది. అనారోగ్యంతో కూలీ చేసుకోలేక తినడానికి ఇబ్బంది అయి నెల నెలా తన జీవనానికి డబ్బులు ఇవ్వమని లేదంటే తను ఇచ్చిన కట్నం బంగారు ఇవ్వమని ఈరోజు బాధితురాలు జహురున్నిసా తనకు న్యాయం కావాలని భర్త ఇంటి ముందు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం.రాజేశ్వరి, జిల్లా అధ్యకురాలు నంది విజయలక్ష్మీ,. మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి సరస్వతి, ఆళ్లగడ్డ మండల అధ్యక్షురాలు ముడియం.సునీత, బేతంచెర్ల మండల అధ్యక్షురాలు భాను,మాబ్బీ,ఇదుర్స్ బీ, రెహేనా పాల్గొన్నారు.
80 Total Views, 4 Views Today