భువనేశ్వరి కేసును చేధించిన పోలీసులు…
1 min read
AABNEWS : ప్రకాశం: దివ్యాంగురాలు భువనేశ్వరి కేసును పోలీసులు చేధించారు. ఈనెల 18న ఒంగోలు శివారులో భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుందని ఎస్పీ సిద్దార్థకౌశల్ తెలిపారు. భువనేశ్వరి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. భువనేశ్వరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓలా యాప్‌లో స్నేహితులతో చెప్పిందని ఎస్పీ తెలిపారు. భువనేశ్వరి (22) దివ్యాంగురాలు. ఆమె నగరంలోని 12వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా పని చేస్తోంది. భువనేశ్వరి రోజూమాదిరిగానే శుక్రవారం సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం 6.49 గంటల సమయంలో తల్లితో ఫోన్లో మాట్లాడింది. ఆతర్వాత ఇంటికి రాలేదు. జానకి రాత్రి 8 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఆమె వెతుకులాడటం ప్రారంభించింది. రాత్రి 8 గంటల తర్వాత దశరాజుపల్లి రోడ్డులోని చినవెంకన్న కుంట వద్ద మూడు చక్రాల సైకిల్‌పై ఓ యువతి తగులబడుతుందన్న సమాచారాన్ని కిమ్స్ ఆసుపత్రిలోని సెక్యూరిటీ ఆఫీసర్ తాలూకా పోలీసులకు ఫోన్ చేసి ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా ఆమె మంటల్లో తగులబడుతూ కన్పించింది. వెంటనే ఫైరింజన్‌ను పిలిపించి మంటలు ఆర్పారు.
88 Total Views, 2 Views Today