మతాల మధ్య చిచ్చు రాజేస్తున్న టిడిపి…
1 min read
AABNEWS : వినుకొండ: నేడు దేశంలో ఎన్నడు కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష టిడిపి మతాలను రెచ్చగొట్టే అగ్గి రాజేసే విధంగా దేవాలయాలపై దాడులు చేసి దుర్మార్గాలకు పాల్పడుతూ ప్రజల ఆలోచనా విధానాలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయటం అవివేకమని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.అమ్మ వడి, వైయస్సార్ ఆసరా, భరోసా, చేయూత, జగనన్న తోడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉంటే ఓర్వలేని చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం ప్రజల ఆలోచనలను పక్కదోవ పట్టించేందుకు దేవాలయాలపై దాడులు, విధ్వంసాలను ప్రజలు గమనిస్తూ సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ టిడిపి కార్యకర్తల వ్యవహరిస్తారని, కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఉద్యోగులంతా నిమగ్నమై పనిచేస్తుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి, అమ్మ ఒడి పథకాన్ని అడ్డుకునేందుకు ఈసీ ఎన్నికల కోడ్ ను ప్రకటించడం దుర్మార్గమన్నారు.40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో డ్రామాలు వేయటం లోకేష్ ,పత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, ఈ సి రమేష్ లాంటివాళ్ళు పాత్రలు పోషిస్తున్న వింత నాటకానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. కృష్ణా పుష్కరాల పేరుతో 48 దేవాలయాలను తొలగించిన చంద్రబాబుకు నాడు మతం, హిందూ ప్రాముఖ్యత గుర్తు రాలేదా అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రశ్నించారు. బాబు కూల్చిన దేవాలయాలకు నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పుణ నిర్మాణం చేపడుతున్నారని అందుకు యావత్ ప్రజలు పాలాభిషేకం తో బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. దేవాలయాల్లో జరిగిన దాడులపై సి.బి.ఐ దర్యాప్తు జరుగుతోందని శిలా విగ్రహాలను కూల్చిన వ్యక్తులతో పాటు కారకులైన వారు త్వరలోనే ప్రజల ముందు దోషులుగా నిలబడకుండా అని ఆయన తెలిపారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు నిర్మాణానికి స్పందించిన సీఎం ప్రత్యేక గ్రాంటు నుండి 8 కోట్లు నిధులు కేటాయించిన గొప్ప మనసున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వ మతాలని సగర్వంగా ప్రేమించే అలాంటి వ్యక్తిపై ప్రతిపక్షాలు బురద జల్లడం సబబు కాదని సీఎం ఎం పై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను ఏపీ బ్రాహ్మణ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. పుష్కరాల సమయంలో దేవాలయాన్ని కూల్చి వేసిన చరిత్ర చంద్రబాబుది అయితే దేవాలయాల తొలగింపు స్థలాల్లో నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలయాల నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం బాల్ రెడ్డి ,బ్రాహ్మణ సంఘం నాయకులు టి .వెంకటేశ్వర్లు, మూర్తి ,భాగవతుల రవికుమార్ తదితరులు ఉన్నారు.
308 Total Views, 2 Views Today