మద్యం అక్రమాలపై ఉపేక్షించేది లేదంటున్న మంత్రి కొడాలి నాని…
1 min read
AABNEWS : తప్పులు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశంగుడివాడ గుడివాడ టైమ్స్మద్యం అక్రమాలకు సంబంధించి ఎక్కడైనా తప్పులు జరిగాయన్న సమాచారం రాగానే ఖచ్చితంగా దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . సోమవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం తమిరిశ గ్రామంలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపులో అక్రమాలకు పాల్పడిన సిబ్బంది కుటుంబ సభ్యులు కలిశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం బాటిల్స్ పై ప్రభుత్వం రూ .150 లు ముద్రిస్తే దానిపై రూ . 190 ల ఎంఆర్పీ స్టిక్కర్ ను అంటించి విక్రయాలు చేస్తుండగా అధికారులు డూప్లికేట్ స్టిక్కరింగ్ ను గుర్తించి మద్యం బాటిల్స్ ను సీజ్ చేశారన్నారు . స్టిక్కరింగ్ ను మార్చడం తప్పేనని , సిబ్బందిపై చర్యలు లేకుండా చూడాలని వారు కోరారు . అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 2020 మే 16 న ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు . ఈ బ్యూరో మద్యం , ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకుంటుందన్నారు . మద్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారన్నారు . అక్రమాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టేవారని ఉపేక్షించడం లేదన్నారు . సీఎం జగన్ ఆదేశాలతో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఉ ధృతంగా దాడులు చేస్తోందన్నారు . సమర్ధత , నిజాయితీపరులైన అధికారులు బ్యూరోలో స్థానం కల్పించారన్నారు . ప్రతి వారం సమావేశమై సమీక్షిస్తున్నారని చెప్పారు . మద్యం అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు .
113 Total Views, 2 Views Today