AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మనకు స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో మన భారతదేశ జనాభా సరాసరి ఆయుష్షు ముఫ్పైమూడేళ్లే…..

1 min read

AAB NEWS : డా.కాలేషా బాషా : మనకు స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో మన భారతదేశ జనాభా సరాసరి ఆయుష్షు ముఫ్పైమూడేళ్లే రెండువందల ఏళ్లతరబడి సాగిన శాస్త్ర విజ్ఙానశోధనతో,ఆధునిక మెడికల్ సైన్సెస్ ఆవిష్కరణతో మనదేశంలో అది డెబ్భైఏండ్లకు పెరిగింది.విదేశాలలో అయితే ఎనభై ఏండ్ల ఆయుష్షు వరకూ బతుకుతున్నారు.
ఇది ఏనాటువైద్యాలతోనో పసరు వైద్యాలతోనో కాదు.మానవ మస్తిష్కాన్ని మథించి ఆవిష్కరింపబడిన ఆధునిక వైద్యవిజ్ఙానశాస్త్రాలతోనే సాధ్యమైంది. రేపు ఏ వ్యక్తికి అయినా హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ వేయాల్సిందీ,ఉరఃపంజరాన్ని తెరచి,హార్ట్ సర్జరీ చేసి కాపాడాల్సిందీ..ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి మెదడుకు దెబ్బతగిలితే….,
కపాలం తెరిచి ఆపరేషన్ చేయాల్సిందీ.కంటిలోని కటకం మందమై,చూపు మసకబారి,
పగలే చీకట్లు అలుముకుంటే. కుట్టులేని ఆపరేషన్ ద్వారా నూతనదృష్టిని ప్రసాదించేదీ.. ఏ తల్లికైనా గర్భంలోని బిడ్డ అడ్డం తిరిగి ప్రసవం కష్టమైతే….ఆ ప్రాణాపాయస్థితిలో శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డకు ఆయువుపోసేదీ,ఆ తల్లికి పునర్జన్మ నిచ్చేదీ… ఇలా వీరందరి ఆయుష్షును పెంచా వలసింది ఆధునిక మెడికల్ విజ్ఙాన సారస్వతం తోనే…

ఏ నాటు వైద్యంతోనో….,
ఏ పసరు చుక్కలతోనో,
ఏ మూలికల చూర్ణాలతోనో,
ఏ వేర్ల భస్మాలతోనో

మంత్ర తంత్ర అంత్రాలతోనో, భూతవైద్యంతోనో,
తాయెత్తులతోనో,
తావీజులతోనో,
అంజనంతోనో,
విభూదిపొట్లాలతోనో,

చేతబడి విద్యలతోనో,
క్షుద్ర పూజలతోనో,
జంతు బలుల తోనో,
ఆయిల్ పుల్లింగ్తోనో,
రైస్ పుల్లింగ్తోనో,
ప్రాణిక్ హీలింగ్తోనో,

సామూహిక ప్రార్ధనలతోనో,
స్వస్థతాకూటములతోనో,
సమాధులచుట్టూ ప్రదక్షిణలతోనో,
రేయి జాగారాలతోనో,

హోమియో పతితోనో,
న్యాచురోపతితోనో,
యునానీతోనో,
సిద్ధుల వైద్యంతోనో,
ఆయుర్వేదంతోనో, మధ్యయుగాల
చీకటికాలాలనాటి వైద్యప్రక్రియలతోనో కాదు..
కానే కాదు!సంపూర్ణ మానవశరీర విజ్ఙానంతోనూ,పరిశీలనతోనూ,ప్రయోగంతోనూ,పరిశోధనతోనూ పరిపూర్ణమైన ఆధునిక వైద్యవిజ్ఙానంతో మాత్రమే పై చెప్పిన వారందరికీ ప్రాణం పోయగలం….ఆయువు పెంచగలం.ఎవరేమన్నా ఇది కాదనలేని నిజం!!

ఇంతవరకూ
ఏవో అపసోపాలు పడుతూ ముందుకు పోతున్న దేశాన్నీ,ప్రజానీకాన్ని మరికొంత వెనక్కు, చీకట్లోకి,మద్యయుగాల మూఢనమ్మకాలలోకి, మరింత అజ్ఙానంలోకి నెట్టివేయబడకుండా కాపాడవలసింది ఈ దేశంలో చదువుకున్న యువతరం,ఆలోచించే పెద్దలూ,మేథావులూ,శాస్త్రవేత్తలూనూ.

అయితే ప్రస్తుత సమాజంలో మనలోని చదువుకున్నవారు కూడా ఈ మూఢాచారాలకు,
నమ్మకాలకు లొంగిపోయి,ఆలోచించడం మానుకుని,మెదడు ద్వారాలు మూసివేసి ‌
బూజుపట్టిన అంధవిశ్వాసాలకే వంతపాడుతున్నారు….
వాటినే ఇంకా ఆచరిస్తున్నారు.
ప్రపంచదేశాలు మనలను అనాగరికులుగా అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు.

భారతదేశ ఆత్మనూ,హృదయాన్నీ కలచి వేస్తున్న అంశం ఇదే!
అందుకే నేటి భారతం మౌనంగా రోదిస్తూ ఉంది!!!

 219 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.