మహిళ లేనిదే మనిషి మనుగడ అసాధ్యం చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు…
1 min read
AABNEWS : మహిళ లేనిదే మనిషి మనుగడ అసాధ్యం:చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు మహిళా సాధికారతకు వైఎస్సార్ కాంగ్రెస్ కృషి
పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా సర్పంచులకు ఘన సన్మానం
మహిళ లేనిదే మనిషి మనుగడ సాధ్యం కాదని అమ్మగా,అక్కగా,చెల్లిగా,కూతురిగానే కాకుండా వివిధ రంగాల్లో వైద్యురాలిగా,ఉపాధ్యాయినిగా,లాయర్ గా అనుక్షణం మనిషి మనుగడలో మహిళల పాత్ర ఎంతో ఉందని అలాంటి మహిళను ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల.సురేష్ బాబు,అధ్యక్షులు గుండాల ఆదినారాయణ(సూరి)లు పేర్కొన్నారు.సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన.అనిల్ కుమార్ యాదవ్,స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇంచార్జి రూప్ కుమార్ యాదవ్ ల సూచన మేరకు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గూడూరు,చిల్లకూరు మండలాల్లో పంచాయతీ సర్పంచ్ లుగా ఎన్నికైన మహిళలను సోమవారం చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు.తొలుత గూడూరు మండలం మేకనూరు చేరుకొని అక్కడ జరిగిన అభినందన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గొర్ల.విజయరమేష్ ను సత్కరించారు. అనంతరం అయ్యవారిపాలెం చేరుకుని సర్పంచ్ పెనుబోలు.మంజులమ్మను సత్కరించారు.ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు సీఎం జగన్ చిత్రపటాలను బహూకరించారు. ఈ సందర్భంగా మండ్ల.సురేష్ బాబు మాట్లాడుతూ మహిళా సర్పంచులు గ్రామాల్లో ఆదర్శ పాలన అందించాలని సూచించారు.రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తున్నారన్నారు.చేగువేరా ఫౌండేషన్ సేవ కార్యక్రమాల్లో బాగస్వామ్యులుగా ఉంటూ రాజకీయ రంగంలో ప్రవేశించిన తమ సభ్యులు సర్పంచులుగా ఎన్నక కావడం తమకు గర్వంగా ఉందన్నారు.చేగువేరా ఫౌండేషన్ మద్దతు అభ్యర్థులు గూడూరు మండలం కుందకూరు అయ్యవారిపాలెం,మేకనూరు,చిల్లకూరు మండలం తిమ్మనగారిపాలెం పంచాయతీల్లో విజయం సాధించారన్నారు. గుండాల.ఆదినారాయణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మహిళ లేనిదే మనిషి జీవనం సాధ్యం కాదన్నారు.సేవ,రాజకీయ రంగంలో కూడా మహిళలు తమ సత్తా చాటడం అభినందనీయమన్నారు.అనంతరం చిల్లకూరు మండలం తిమ్మనగారిపాలెం చేరుకొని అక్కడ గ్రామ సర్పంచిగా ఎన్నికైన గిద్దలూరు.సుమలత రమణయ్యను అభినందించారు.ఈ కార్యక్రమంలో చేగువేరా ఫౌండేషన్ గూడూరు సభ్యులు, పాల్గొన్న మధుసూదన్ రెడ్డి , నరేష్ రెడ్డి, శ్రీనివాసులు సుమన్తేజ, వెంకటేష్ , సంతన్ రాజా,ప్రశాంత్,కోటి,దయాకర్,భానుచందర్, మేకనూరు గ్రామ సభ్యులు చల్లా.తిరుమలయ్య. నల్లిబోయిన.కిష్టయ్య , మన్నూరు.శిన్నరెడ్డీ,తిరుపాల యాదవ్ కిరణ్ ,ఉపసర్పంచి .వార్డు మెంబరు అయ్యవారిపాలెం గ్రామంలో పాల్గొన్న సభ్యులు శేషారెడ్డి, కృష్ణారెడ్డి , నిరంజన్ రెడ్డి , రాజేష్ , హరిక్రిష్ణ , మరియు వార్డ్ నెంబర్లు వాలెంటర్ల్లుమెంబర్లు తదితరులు . మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు పాల్గొన్నారు.



478 Total Views, 2 Views Today