AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాజీ శాసన సభ్యులు పాశిం.సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు…

1 min read

AAB NEWS : గూడూరు పట్టణం: మాజీ శాసన సభ్యులు పాశిం.సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు…కొత్తగా ప్రవేశ పెట్టినటువంటి మూల విలువ ఆదారిత పన్నులు కాకుండా గతంలో ఉన్నటువంటి వార్షిక అద్దె విలువ ఆదారిత పన్నుల విధానాన్నే కొనసాగించి, తద్వారా పేద, మద్య తరగతి ప్రజల మీద భారం పడకుండా చర్యలు తీసుకోవాల్సినదిగా కోరుతు గూడూరు పురపాలకసంఘ కమిషనర్ గారికి వినతి పత్రం అందిచిన – గూడూరు పట్టణ నాయకులు

మీడియాతో మాట్లాడుతూ…

ఇప్పటివరకు పురపాలక సంఘాలలో వార్షిక అద్దె విలువ ఆధారముగా ఇంటి పన్నులు, నివాస యేతర పన్నులు విధించుచున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పన్నులను వార్షిక అద్దె విలువతో కాకుండా, రిజిస్ట్రేషన్ విలువతో పన్నులు విదింపు విధానాన్ని చట్టం చేయడం బాధాకరం.

తద్వారా పేద,దిగువ మద్య తరగతి ప్రజలు చాలా అధిక మొత్తంలో ఇంటి పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఇప్పటి వరకు ఉన్న పన్నులు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉన్నది.

అంతే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన GO:198 ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ పెరుగుదలతో ఇంటి పన్నులు కూడా పెరుగుతాయని తెలియచున్నది. రిజిస్ట్రేషన్ విలువతో పన్నులు విదుంచుట వల్ల ప్రతి సంవత్సరం పన్నులు పెరుగుతాయి. దీని వలన పేద మద్య తరగతి కుటుంభాల వారు ఇంటి పన్నులు చెల్లించలేని పరిస్థితికి వస్తారు.

కావున పురపాలకసంఘం కౌన్సిల్ వారి ద్వారా కొత్తగా ప్రవేశ పెట్టినటువంటి మూల విలువ ఆదారిత పన్నులు కాకుండా గతంలో ఉన్నటువంటి వార్షిక అద్దె విలువ ఆదారిత పన్నుల విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వాని కోరుతూ కౌన్సిల్ నందు తీర్మానం చేసి పంపించవలసినదిగ కోరుతున్నాము. అంతే కాకుండా తద్వారా పేద మద్య తరగతి ప్రజల మీద భారం పడకుండా చర్యలు తీసుకోవాల్సినదిగా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షులు పులిమి.శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు.చెంచు రామయ్య, పట్టణ ప్రధాన కారదర్సి నిమ్మకాయల నరసింహులు, మాజీ కౌన్సిలర్లు వాతంబెటి.శివకుమార్ , పుచ్చలపల్లి.వెంకటేశ్వర్లు, నాయకులు అలీ హుస్సేన్ , పిల్లెల.శ్రీనివాసులు, BC సెల్ అద్యక్షుడు శివ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 184 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.