AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ లను మీరు మావోయిస్టులు అని భావిస్తున్నారా .సమాధానం చెప్పాలి .పోతుల నాగరాజు,రాష్ట్ర అధికార ప్రతినిధి ,కాంగ్రెస్ పార్టీ…

1 min read

AAB NEWS :రాష్ట్రంలో జర్నలిస్ట్ ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది మీ పాలన లో .ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కావడానికి జర్నలిస్ట్ ల పాత్ర చాలా కీలకం కానీ మీరు వారిని వారి హక్కులను ఉక్కు పాదం తో అణచివేయడానికి కారణం ఏమిటి ? వారు చేసిన నేరం ఏమిటి ?ఇంతవరకు అక్రిడేసన్లు గాని,హెల్త్ కార్డ్స్ గానీ ఎందుకు మంజూరు చేయలేదు? రాష్ట్రంలో అడిగిన వారికి అడగని వారికి కార్పొరేషన్ లు ,అకౌంట్లలో వేలకు వేలు డబ్బులు వేస్తున్నారు. మరి మీకు జర్నలిస్ట్ లు గాని వారి స్తితి గతులు కానీ కనిపించే అవకాశం లేదా ? ఒక జర్నలిస్ట్ వర్గానికి చెందిన వ్యక్తి ని మీరు ముఖ్య సలహాదారు నిగా నియమించు కొన్నారు. కానీ వారిపై కక్ష సాధిస్తున్నారు. రాష్ట్రంలో మీరు 2 సంవత్సరాలలో 1 లక్ష 32 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో జమ చేసాము అంటున్నారు, అదే డబ్బులు ఎంతమంది జర్నలిస్టుల ఖాతాలో వేశారో చెప్పగలరా ?మరి ఎందుకు ఇంత దారుణంగా జర్నలిస్ట్ లను వారి కుటుంబాలకు మీరు నష్టం కలిగిస్తున్నారు..వారు ఏమైనా మీ దృష్టిలో మావోయిస్టులా సమాధానం ప్రజల కు చెప్పాలి.లేకుంటే తక్షణమే జర్నలిస్ట్ లకు అక్రిడేసన్లు ,హెల్త్ కార్డ్స్ ను,మంజూరు చేయాలని, జర్నలిస్ట్ ల సంక్షేమము కోసం ప్రత్యేక నిధి ని కానీ, కార్పొరేషన్ గాని ఏర్పాటు చేయాలని, ఈ కరోన సమయంలో ప్రతి జర్నలిస్ట్ కుటుంబం కు నెలకు 15 వేల రూపాయలు, 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకుల ను అందచేయాలని, కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది..

 204 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.