AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మూర్ఖత్వం తారాస్థాయికి చేరిన వేళ…

1 min read

AABNEWS : కోవిడ్‌-19 మహమ్మారి రెండో విడత ఒక పక్క దేశమంతటా విజృంభిస్తోంది. దేశ ఆరోగ్య వ్యవస్థనంతటినీ కోవిడ్‌ పై పోరుకు సిద్ధం చేయడంలో ముందుండాల్సిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హర్షవర్ధన్‌ ఏం చేస్తున్నారు? ఏప్రిల్‌ మాసం మధ్యవారంలో వివిధ విభాగాల అధిపతులను సమావేశపరచి స్వదేశీ ఆవుల మీద పరిశోధనను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు స్వదేశీ ఆవులనుంచి వచ్చే ఉత్పత్తులు (?) శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఏ విధంగా మెరుగ్గా వినియోగించాలి ” అనేది ఆ ప్రాజెక్టుకు పేరు ! ఆవునుండి వచ్చే ఉత్పత్తులు ఏముంటాయి ? ఆవు పేడ, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి. ఈ ఐదింటినీ కలిపి ”పంచ గవ్య” అని ఓ పేరు పెట్టారు.సాంప్రదాయంగా పూజల్లో పంచామృతం అని వాడతారు. అందులో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు కలుపుతారు. ఆ సాంప్రదాయానికి నేడు ఎంత అర్ధం ఉన్నదీ పక్కన పెడితే అందులో పేడ, ఉచ్చ కలపరు. ఈ రెండింటినీ కలపడం హిందూత్వ మార్క్‌ ప్రత్యేక మూర్ఖత్వం.) ఈ పంచగవ్య మిశ్రమానికి ఒక శాస్త్రీయమైన భాష్యం చెప్పడానికి, దానిని శాస్త్ర పరిశోధనలు ధృవ పరిచాయని ప్రచారం చేసుకోడానికి ఈ ప్రాజెక్టు వచ్చిందిఇందుకోసం ఏకంగా రు. 100 కోట్లు కేటాయించారు ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని మంత్రి గారు తీవ్ర అసహనం వెలిబుచ్చారట. అసలు ఇప్పటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేసివుంటే రెండో విడత కోవిడ్‌ తలెత్తగానే దేశంలో అందరికీ ఆయుష్‌ ప్రాజెక్టు ద్వారా ఇంత పేడ, ఆవు మూత్రం ఇచ్చి వాటిని పాలతో కలుపుకుని తాగమని ప్రచారం చేసివుండేవారేమో మరి !గుజరాత్‌ లో ఇప్పటికే ఈ పైత్యం బాగా తలకెక్కినట్టుంది. జనాలు గోశాలల దగ్గరికి పోయి వంటినిండా ఆవుపేడ, మూత్రం పులుముకుని వస్తున్నారట ! దాంతో కరోనా దరి చేరదని నమ్ముతున్నారట! ఈరోజు కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్‌ మొదటి మూడు స్థానాల్లో ఉంది! అక్కడ మరణాల రేటు కూడా దేశంలోకెల్లా అత్యధికంగా ఉంది ! ఇక యోగి ఆదిత్యనాధ్‌ ఏమీ తక్కువ తినలేదుప్రజలు ఆక్సిజన్‌ కూడా దొరక్క చస్తూంటే పట్టించుకోకుండా ప్రతీ జిల్లాలోనూ గో రక్షణకు హెల్ప్‌ డెస్క్‌ లు వెంటనే ఏర్పాటు చేయలని ఆదేశించాడు ! మరి జిల్లాల అధికారులంతా ఆ పనిలో ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకుంటారు? కరోనాతో మరణించిన వారి దేహాలకు అంత్యక్రియలు కూడా జరగనందువల్లనే అక్కడినుండి బీహార్‌ రాష్ట్రంలోకి గంగానది ద్వారా శవాలు కొట్టుకొస్తున్నాయి !మానవత్వం ఏమాత్రమూ లేని హిందూత్వ అసలు రూపం ఇది.

 109 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.