జగన్ చెప్పేవన్నీ అబద్దాలే…
1 min read
AABNEWS : ముఠా నాయకుడు జగన్ చెప్పిన విధంగానే మంత్రులు అబద్దాలు చెబుతున్నారని జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్ దుయ్యబట్టారు. ఆర్థిక నేరాలు కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు ఆదర్శం అయితే… జనసేనకు పవన్ కళ్యాణ్ ఆదర్శమని చెప్పారు. ఎకరానికి రూ.35 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ చెబుతుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వక్రబాష్యం చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. మునిగిపోయే భూములు పేదలకు ఇళ్ళ స్థలాలుగా పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ అబద్దాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కొడాలి నానికి బూతులు తిట్టడం తప్ప ఏమీ తెలియదన్నారు. కొడాలి నానికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో 82 లక్షల మంది రైతులు ఉంటే రైతు భరోసా ద్వారా 52 లక్షలు మంది రైతులకు వర్తింప చేస్తున్నారన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వాన్ని రైసు మిల్లు మాఫియా నడుపుతుందని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా రైతులకు ఎకరానికి రూ.35 వేలు ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని దుర్గేష్ హెచ్చరించారు.
51 Total Views, 2 Views Today