AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రెండు పడవల బ్యాలెన్స్ వర్క్ అవుట్ కావడం లేదా…?

1 min read

AAB NEWS :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జనసేన అంటూ తన సొంత పార్టీ ఎలాగూ ఉంది.. కానీ ఆయన తీరు మాత్రం అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడో తెలియని పరిస్థితి. జనసేన అభిమానుల్లో కూడా అదే అయోమయం నెలకొంది. ఇక సినిమాల్లో కూడా పవన్ తీరు అసలు ఎవరి ఊహకు కూడా అందడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా జర్నీ కూడా అచ్చం అలాగే సాగుతోంది. అసలు సినిమాలలోనే నటించను అని ఒకప్పుడు చెప్పిన పవన్.. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం కొంచెం గ్యాప్ తీసుకుని వరుసగా సినిమాలు చేస్తాను అని చెప్పి అభిమానులను ఖుషీ చేశారు.‘అజ్ఞాతవాసి’ తర్వాత ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా మారానన్నారు. ‘వకీల్‌సాబ్’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశాడు. ఒకేసారి 5 సినిమాలకి సైన్‌ చేసి, ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరిచాడు పవన్. పాలిటిక్స్‌ నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చాక.. ఒకేసారి నాలుగైదు సినిమాలకి సైన్‌ చేశాడు. క్రిష్‌తో పీరియాడికల్‌ డ్రామా, హరీశ్‌ శంకర్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, మళయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

పొలిటికల్‌ షెడ్యూల్స్, సినిమా షూటింగ్స్‌ ని బ్యాలెన్స్‌ చేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నాడు పవన్. ఓ వైపు జనసేనను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అనుకుంటూ ఉండగా.. మరో వైపు సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోతున్నాడు. నిజం చెప్పాలంటే అటు రాజకీయాలకు.. సినిమా షూటింగ్స్‌ అడ్డొస్తున్నాయి. ఢిల్లీ టూర్లు, ఉప ఎన్నికల కారణంగా షూటింగ్‌ షెడ్యూల్స్‌ పోస్ట్‌ పోన్ అవుతున్నాయని అంటున్నారు. దీంతో పవన్ రెండు పడవల బ్యాలెన్స్ వర్క్ అవుట్ కావడం లేదనే అంటున్నారు.

 436 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.