AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం…

1 min read

AABNEWS : అధికారికంగా ఓ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తోంది. టాలీవుడ్‌లో ఆసక్తి రేపిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇటీవల కొన్ని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లను చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి ఖండించింది. అవన్నీ అవాస్తవాలని, విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని ఆ సంస్థ ప్రకటించింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న ‘లైగర్’ సినిమా, దర్శకుడు సుకుమార్ చేస్తున్న ‘పుష్ప’ సినిమా పూర్తవ్వగానే విజయ్ – సుకుమార్ కాంబో చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రేజీ సినిమా మరింత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ తెలిపింది. కాగా, అంతకుముందు సుకుమార్‌ ‘పుష్ప’ తర్వాత మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌తో చిత్రం చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే

 1,744 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.