AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లక్షల కోట్లు ఇచ్చిన వెలకట్టలేని మీ సేవకు నా హ్యాట్స్ఆఫ్ ఎపి డి‌జి‌పి ప్రపంచ చరిత్ర లో గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైన పరిస్థితి రాలేదు…

1 min read

AABNEWS :లక్షల కోట్లు ఇచ్చిన వెలకట్టలేని మీ సేవకు నా హ్యాట్స్ఆఫ్ ఎపి డి‌జి‌పి ప్రపంచ చరిత్ర లో గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైన ఇటువంటి పరిస్థితి రాలేదు. అత్యంత స్వల్పకాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించి మానవ సమాజంపైన తీవ్ర ప్రభావం చూపించింది. ఆర్ధికంగా, సామాజికంగానే కాకుండా బంధాలు, బాంధవ్యలను, విలువలను సైతం దూరం చేసి ఎన్నో కుటుంబాలల్లో విషాదాన్ని మిగిల్చింది. కన్న తల్లిదండ్రులు మృతి చెందితే పిల్లలు అంతక్రియలు జరపలేని దుర్బర స్థితులకు తీసుకువచ్చింది ఈ కరోన.ఒక కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోతే… మరో కుటుంబం ఇంటి ఇల్లాలును కోల్పోయింది. మరో కుటుంబంలో అభంశుభం తెలియని చిన్నారులు తమ తల్లిని, తండ్రిని, ఇద్దరినీ కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. కరోనా వేగవంతంగా వ్యాప్తి చెందడం లాంటి పరిస్థితులలో, కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మశానానికి తీసుకు వెళ్ళడానికి కుటుంబ సభ్యులు సైతం ధైర్యం చేయని పరిస్థితి. అంతటి కష్టకాలంలో ఏమీ ఆశించకుండా నిస్వార్ధంగా ప్రాణాలకు తెగించి జాతి, కులం, మతం, ప్రాంతం, భాషతో తారతమ్యం లేకుండా మానవత్వమే పరమావధిగా వారికి అంతిమ సంస్కారాలు జరిపిస్తూ ఆపద్బాంధవులయ్యారు. ఈ విపత్కర పరిస్థితిలో ఎంతోమంది తమవంతు భాద్యతగా సేవ చేస్తున్నారు..అందరినీ చేరుకోలేకపోయిన వారిలో అందుబాటులో ఉన్న కొంతమందిని సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది. కరోన కష్టకాలంలో మీరు చూపించిన సహృదయం, మానవతా దృక్పథం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇటువంటి గొప్ప వ్యక్తులను గౌరవించడం అంటే మానవ సమాజంలో ఉన్న మానవత్వాన్ని గౌరవించడం అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చేస్తున్న ఈ వెలకట్ట లేని సేవలను స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని మరెంతోమంది ముందుకు వచ్చి ఇటువంటి మహత్తర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, వారు సైతం సమాజానికి స్పూర్తిదాయకంగా నిలవాలని కోరుతున్నాము. ఈ కరోన కష్ట కాలంలో పోలీసులు సైతం తమ కుటుంబాలను వదిలి నెలల తరబడి ప్రజారోగ్య రక్షణలో విధులు నిర్వహిస్తు ఎందరో ప్రాణాలను కోల్పోయారు. మరెందరో వేల మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ మీరు అందిస్తున్న ఈ అమూల్యమైన సమాజ సేవలకుగాను “మానవత్వ ధీర”గా గుర్తిస్తుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి చిన్నపనిలో పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయం పడుతున్నా ఈ రోజుల్లో మీ వంటివారు నిశ్శబ్దంగా, నిస్వార్ధమైన, ఎలాంటి లాభాని ఆశించకుండా జాతి, కులం,మతం,ప్రాంతం,భాష తారతమ్యం లేకుండా నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు కాబట్టే సమాజం ఇప్పటికీ మనుగడ సాగిస్తోంది అనడంలో సందేహం లేదు.**ఇదే స్పూర్తి, పట్టుదల, దృడసంకల్పంతో కలసికట్టుగా మన అందరం ముందుకు సాగితే కరోనా మహమ్మారి ని మాత్రమే కాదు మరెన్నో సవాళ్లను సునాయసంగా అధిగమించవచ్చు.**కోవిడ్ క్లిష్ట సమయంలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా మానవ్యతంతో ముందుకు వచ్చి నిస్వార్ధంగా తమకు తోచిన విధంగా వివిధ రూపాల్లో తమవంతు భాద్యతగా మానవత్వం తో సేవలను అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం, ఎపి పోలీస్ శాఖ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది.

 430 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.