September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లేబర్ కోడ్స్, రైతు వ్యతిరేక, విద్యుత్ సవరణ వ్యతిరేక చట్టాల జీవోలు దగ్ధం…

1 min read

AABNEWS : సీఐటియు ఆధ్వర్యంలో “లేబర్ కోడ్స్, రైతు వ్యతిరేక, విద్యుత్ సవరణ వ్యతిరేక చట్టాల జీవోలు దగ్ధం”!! శ్రీశైలం ప్రాజెక్టు: 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మూడు కోడ్లుగా గా విభజించింది. ఈ రోజు దేశ వ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో కార్మిక వ్యతిరేక చట్టాల పత్రాలను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు దర్శనం నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరాల్లో కార్మిక చట్టాలను రద్దు చేస్తూ యజమానులకు బానిసలుగా మార్చే విధంగా ఈ చట్టలను తెచిందన్నరు. ప్రభుత్వం ఈ దుర్మార్గమైన చట్టాలను తెచ్చినందు వలన లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారని వారు విమర్శించారు. అలాగే ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టిన ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతున్నారని వారు ఖండించారు.కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2021 బడ్జెట్ వ్యవసాయ రైతు వ్యతిరేక బడ్జెట్ గా మారిందన్నారు .ఢిల్లీలో దాదాపుగా అఖిలపక్ష రైతు సంఘాలు మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని 70 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉద్యోగుల ను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టి రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఖాసిం, సీ హెచ్.మస్తాన్ కె.పీరా, డి.రజాక్, డి. రాజభి,సీ హెచ్. సైదాబి, డి. చాందు భాషా, బాదరమ్మ, హసీనా, నాగుర్ భీ, రఫీ, కాశీ తదితరులు పాల్గొన్నారు.

 386 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.