AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వాలంటీర్ ఎన్నికలకు ప్రచారం లో పోతేగుంట…

1 min read

AABNEWS : ప్రజలకి సేవలు అందించటం కోసమా. పార్టీ కోసం ప్రచారం చేయటం కోసమా..సైదాపురం మండలం, పోతేగుంట. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా వుండాలి అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోతెగుంట గ్రామ పరిధిలో వాలంటీర్లు నేరుగా ఎన్నికల ప్రచారం లో పాల్గొనటం విశేషం. అడిగిన గ్రామస్థులను బెదిరిస్తూ సదరు వాలంటీర్ నేను రాజీనామా చేసేసాను వాలంటీర్ పదవికి అని మాట జారవేసి వెంటనే నన్ను ఎవరు మీరు అడగటానికి అని బెదిరించే దోరణిలో మాట్లాడిన వెంటనే గ్రామస్తులు అందరూ ఎదురు తిరిగారు. వాలెంటేర్ గా పని చేస్తున్న నసనకొటి రమేష్ గ్రామ పరిధిలో తాను చెప్పిన వారికి ఓటు వేయకపోతే మీ పెన్షన్లు అపెస్తాము అని బెదిరిస్తూ ప్రజలని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇతని మీద చర్యలు తీసుకోవాలి అని సైదాపురం టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు కట్టా మోహన్ కృష్ణా రెడ్డి గారు మండల ఎంపిడిఓ వాణి గారికి వివరాలు తెలియచేశారు. చర్యలు తీసుకుంటారో.. అధికార పార్టీకి భయపడి వదిలేస్తారో వేచి చూడాలి.

 569 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.