AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వాహనదారులకు భారీ షాక్…

1 min read

AABNEWS : వాహనదారులకు భారీ షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం.ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మీ జేబులు చిల్లు పడటం ఖాయం.ఎందుకంటే జగన్ ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి జరిమానాల కొరడా ఝుళిపించనుంది.అక్టోబర్ లో ట్రాఫిక్ రూల్స్ కి సంభంధించిన నిభందానాలకు పలు సవరణలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం జీవో ను జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో కొత్త ఏడాది సందర్బంగా జనవరి 1 నుండి అమల్లోకి తీసుకురానుంది జగన్ ప్రభుత్వం. మునుపటి కంటే పది రెట్లు ఫైన్లు పెంచేసి సామాన్యులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.ఫైన్‌లు పెంచేసిన ప్రభుత్వం వెయ్యి నుంచి లక్షల రూపాయల వరకు జరిమానాలతో వాహనదారుల వెన్నులో వణుకు పుట్టించనుంది..కొత్తగా అమల్లోకి రానున్న జీవో ప్రకారం హెల్మెట్‌ లేకుండా బైకు నడిపిన, సీటు బెల్ట్‌ పెట్టుకోకుండా కారు నడిపిన ఒకేసారి రూ.వెయ్యి ఫైన్‌ కట్టక తప్పదు. ఇక సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్‌ చేస్తే మీ నెల జీతం వదులుకోవాల్సిందే. ఏకంగా రూ.10వేలు దీనిపై ఫైన్‌ విధించనున్నారు.ఇక ఆటో డ్రైవర్ల విషయానికొస్తే వాళ్లు యూనిఫామ్‌ వేసుకోకపోయిన,వాహనానికి సంభందించిన పత్రాలు లేకపోయిన రూ.500 ఫైన్ ఫైన్ కట్టాల్సిందే. ఈ కొత్త ట్రాఫిక్ జరిమానాలపై పోలీసులకు, ఆర్టీఏకి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది జగన్ ప్రభుత్వం.  వాహనం వేగంగా వెయ్యి రూపాయల జరిమానా తో పాటు చిన్న పిల్లలకు వాహనం నడిపితే రూ.5వేలు విధించాలని స్పష్టం చేసింది.ఇక బైకుల నుంచి ఏడు సీట్ల కారు వరకూ రిటన్నిటికి ఫైన్స్ ఒకే విధంగా ఉంచుతు..వీటన్నిటిని ఒకే కేటగిరిలో ఉంచింది.ఇక భారీ వాహనాలను మరో కేటగిరిలోకి మార్చింది. మొదటి సారి భారీ ఫైన్‌ తర్వాత కూడా పదే పదే తప్పు చేసేవారికి డ్రైవింగ్‌ లైసెన్స్ పూర్తిగా రద్దవుతుందని ప్రభుత్వం జీవోలో హెచ్చరించింది.మొత్తం 31 నిబంధనలకు సవరణ చేస్తూ జగన్‌ ప్రభుత్వం అక్టోబరులో ఇచ్చిన జీవో జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తున్నా ఎక్కువమంది వ్యతిరేకిస్తున్నారు.

 198 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.