AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వాహనదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది…

1 min read

AABNEWS : పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలు, పర్యావరణ హాని కారణంగా ఇప్పుడు వాహనదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. వీటి డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని చాలా సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ముందుకొస్తున్నాయి. ప్రభుత్వం ఈ వాహనాలను ప్రోత్సహించడం, ఆయా కంపెనీలకు రాయితీలు ఇస్తుండటంతో దీనిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ కంపెనీలతో పాటు కొత్త స్టార్టప్​ కంపెనీలు కూడా ముందడుగు వేస్తున్నాయి. దీంతో భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్​ వాహనాల హవా కొనసాగనుంది. ప్రస్తుతం, భారత మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఉత్తమ ఎలక్ట్రికల్​ వాహనాలపై ఓలుక్కేద్దాం.భారత మార్కెట్​లో హీరో మోటార్స్​ సంస్థకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంస్థ ఎన్నో ద్విచక్ర వాహనాలను తయారు చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన తయారీలోనూ దూసుకుపోతుంది. బేసిక్​, బేర్-బోన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేసి ఎలక్ట్రిక్​ వాహన బ్రాండ్​ను ప్రారంభించింది. అయితే, హీరో రాక ముందు ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువగా ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలోనే మంచి పనితీరు గల వాహనాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా 500 కి పైగా డీలర్‌షిప్‌లు, సర్వీస్​ సెంటర్లను కలిగి ఉంది. ఇది 25 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్, ఆప్టిమా, నైక్స్ వంటి స్కూటర్లను ఇప్పటివరకు మూడు లక్షల మందికి పైగా కస్టమర్లు కొనుగోలు చేశారు. ఈ బ్రాండ్ సమీప భవిష్యత్తులో మరికొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్​ చేయనుంది.ఈథర్ ఎనర్జీ కంపెనీ నాణ్యమైన ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఈ సంస్థ ఇటీవలే ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రూపొందించిన ఎలక్ట్రిక్​ స్కూటర్లలో టచ్‌ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంటేషన్, రివర్స్ అసిస్ట్, ఎల్‌ఈడీ లైటింగ్ చుట్టూ వంటి అదనపు ఫీచర్లను కూడా చేర్చింది. ఈథర్ ఎనర్జీ తన స్కూటర్లలో అనేక వేరియంట్లను గత కొన్ని సంవత్సరాలుగా విడుదల చేస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఈ-స్కూటర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బ్రాండ్ నుండి ప్రస్తుతం అథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ అందుబాటులో ఉందిభారతీయ EV తయారీదారు అయిన ఒకినావా దేశంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకినావా EV ప్రయాణం 2015లో ప్రారంభమైంది. ఈ బ్రాండ్ 2016లో రాజస్థాన్‌లోని భివాండిలో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. 2017లో విడుదల ఏసిన ఒకినావా రిడ్జ్, ఒకినావా ప్రైస్​కు మంచి ఆదరణ లభించింది. తర్వాతి కాలంలో ఈ రెండు స్కూటర్ల నుంచి మరిన్ని వేరియంట్లు ప్రారంభించబడ్డాయి. ఒకినావా ఇటీవల R30, లైట్‌ వేరియంట్లను కూడా విడుదల చేసింది. రాబోయే నెలల్లో ఒకినావాను మరిన్ని ఎలక్ట్రిక్​ వాహనాలు విడుదలయ్యే అవకాశం ఉంది.బిగాస్ అనేది ఆర్ఆర్ గ్లోబల్ సంస్థకు చెందిన లైఫ్ స్టైల్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్. ఇది గత 35 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఉంటూ.. మంచి బ్రాండ్​గా గుర్తింపు పొందింది. బిగాస్​ 2020లో A2, B8 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ స్కూటర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం స్టైలిష్​ డిజైన్‌తో రూపొందిచబడ్డాయి. భవిష్యత్తులో మరిన్ని ఈ-స్కూటర్లను లాంఛ్ చేయడానికి బిగాస్​ ప్రణాళికలు రచిస్తోంది. బిగాస్​ A2 స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్​. ఇది గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. దీన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే చాలు 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీనిలో లిథియం- అయాన్ బ్యాటరీ లేదా లీడ్ యాసిడ్ బ్యాటరీని అమర్చారు. మరోవైపు బిగాస్​ B8 ప్రీమియం ఎలక్ట్రిక్​ స్కూటర్​. దీనిలో1900 వాట్ల మోటారును అమర్చారు. దీన్ని ఒక్కసరి ఛార్జ్​ చేస్తే గంటకు 50 కి.మీ వేగంతో 70 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణించగలదు.భారతీయ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారుల్లో ఆంపియర్ ఒకటి. ఇది వినియోగదారుల అభిరుచుల మేరకు వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తోంది. ఆంపియర్ వాహనాలు 2008లో ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరంలో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్​లోకి విడుదల చేసింది. రాబోయే రోజుల్లో ఈ బ్రాండ్​ నుండి మరిన్ని మోడళ్లు విడుదల కానున్నాయి. ఆంపియర్ ప్రస్తుతం రియో, రియో ​​ఎలైట్, వి సిరీస్, ఎం సిరీస్, జీల్ ఈఎక్స్, మాగ్నస్ ప్రో అనే ఎలక్ట్రిక్​ వాహనాలను విక్రయిస్తుంది. దీని వేగం 25 కేఎంపీహెచ్ నుండి 55 కేఎంపీహెచ్ వరకు ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 65 కిలోమీటర్ల నుండి 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రాబోయే రోజుల్లో ఆంపియర్​ నుంచి మరిన్ని మోడళ్లు విడుదల కానున్నాయి.

 99 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.