AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విజయనగరం లోని సుంకరి పేట దగ్గర ఎదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్ లు ఢీకొన్న ఘటనలో

1 min read

AAB NEWS : విశాఖపట్నం జిల్లా విజయనగరం రోడ్డు మార్గం లోగల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
విజయనగరం మండలం లోని సుంకరి పేట దగ్గర ఎదురుగా ఎదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్ లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వరకు చనిపోయినట్లు సమాచారం
రెండు బస్ ల్లో ఉన్న చాలా మంది ప్రయాణికులు కి గాయాలు అవ్వడం తో ఆ ప్రాంతం అంత ఆందోళనకరంగా మారింది
రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ ని తగలబెట్టడం వల్ల విపరీతంగా పొగ వ్యాపించడం తో ఎదురుగా ఎదురుగా వస్తున్న రెండు బస్ లు ఒక్కదానికి ఒక్కటి స్పష్టంగా కనిపించకపోవడం తో
ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది
రెండు బస్ ల్లో ఇరుకుపోయిన చాలా మంది ప్రయాణికులు ని బయటకి తీస్తున్నారు స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలం వద్దకు అంబులెన్స్ లు, పోలీసులు, ఆర్.టి.సి అధికారులు చేరుకున్నారు క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తున్నారు
వెనక నుంచి గ్యాస్ బండల లారీ బస్సును ఢీ కొనడంతో వెనక సీట్ లో ఉన్నవారు కూడా గాయపడినట్లు సమాచారం
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు డ్రైవర్లు కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం…

 1,060 Total Views,  5 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.