అంగన్ వాడీ వర్కర్ గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన గుల్ షద్ బేగం కుటుంబాన్ని…
1 min read
AABNEWS : విజయవాడ / పెనమలూరు గుల్ షద్ బేగం కుటుంబాన్ని అన్ని విధాల అదుకుంటాం తేది -1.3.2021 పెనమలూరు మండలం కానూరు తులసీ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్ వాడీ వర్కర్ గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన గుల్ షద్ బేగం కుటుంబాన్ని అన్ని విధాల అదుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ అన్నారు . స్థానిక ఆటోనగర్ సనత్ నగర్ లో నివశిస్తున్న గుల్ షద్ బేగం కుటుంబాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ పరామర్శించారు . ఆమె గత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు , మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ఆరా తీశారు . లాక్ డౌన్ సమయం నుంచి ఆమె సన్నబడుతున్నదని వివరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుల్ షద్ బేగం మరణం భాదాకరమన్నారు . ఇటీవల కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం కూడా జరిగిందన్నారు . ఆమె మరణానికి కారణాలను వైద్యులు నిర్ధారించవలసి ఉందన్నారు . ఆమె మరణం దురదృష్టకరమైనప్పటికి ఆమె కుటుంబాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖ , ప్రభుత్వం తరుపున అన్ని విధాల అదుకుంటామన్నారు . కలెక్టర్ వెంట పెనమలూరు తహాశీల్దార్ బద్రునాయక్ ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి ఉన్నారు
304 Total Views, 2 Views Today