ప్రైవేట్ బస్సు పల్టీ కొట్టడంతో 30 మందికి పైగా గాయపడ్డారు…
1 min read
AABNEWS : కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని అనుమంచిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సిరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 45 మంది ప్రయాణికులతో బుధవారం రాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో అనుమంచిపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పింది.. రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయే సందర్భంలో డ్రైవర్ అదుపు తప్పినట్లు చెబుతున్నారు. రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు.. బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని తొలుత జగ్గయ్యపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కొందిరిని విజయవాడకు తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జగ్గయ్యపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు.
108 Total Views, 2 Views Today