AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బ్లేడ్ బాబ్జీల దారుణం…

1 min read

AABNEWS : బ్లేడ్ గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు అంతులేకుండా పోతున్నాయి. గంజాయి మత్తులో దుండగులు రెచ్చిపోతున్నారు. నగర శివారు ప్రాంతమైన వైఎస్సార్ కాలనీలో బైక్‌పై వెళుతున్న మహేష్ సాయి అనే యువకుడిపై బ్లేడ్ బ్యాచ్ దాడికి తెగబడింది. ఈ దాడిలో గాయపడిన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. యువకుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో విజయవాడలో బ్లేడ్ గంజాయి బ్యాచ్‌లు పట్టపగలే దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో వారి ఆగడాలు శృతిమించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు రాత్రివేళకే పరిమితమైన వారి ఆగడాలు.. ఇప్పుడు పట్టపగలు కూడా జరుగుతున్నాయి.

 80 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.