September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లైన్‌కు భూ సేకరణ ముమ్మరం…

1 min read

AABNEWS : వరంగల్‌- విజయవాడ మార్గంలో రైల్వే మూడో లైన్‌ నిర్మాణానికి అధికారులు భూసేకరణ చేపట్టారు. సేకరించాల్సిన భూములను గుర్తించారు. భూములు కోల్పోయే రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేటు నిర్ణయంపై చర్చిస్తున్నారు. రైతుల అంగీకారంతో భూములను సేకరించే పనిలో తలమునకలయ్యారు. రైల్వే మూడో లైన్‌ నిర్మాణం కోసం రైల్వే శాఖ అధికారులు సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వరంగల్‌రూరల్‌ జిల్లాలో 13 మండలాల్లోని 11 గ్రామాల్లో 104.13 ఎకరాల భూమిని రైల్వే మూడో లైన్‌ కోసం సేకరించాల్సి ఉంది. ఈ మేరకు రెవెన్యూశాఖ అధికారులు సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట, సంగెం, చింతలపల్లి గ్రామాల్లో 20.03 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. గీసుగొండ మండలంలోని శాయంపేట హవేలి, వంచనగిరి, ధర్మారం గ్రామాల్లో 20.35 ఎకరాల భూసేకరణకు ప్లాన్‌ చేశారు. నెక్కొండ మండలంలో గుండ్రాతిపల్లి, పెద్దకొర్పోలు, అప్పల్‌రావుపేట, నెక్కొండ, చంద్రుగొండ గ్రామాల్లో 63.15 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని ప్రకటించారు. కాగా, గుండ్రాతిపల్లిలో 4.05, పెద్దకొర్పోలులో 11.01, అప్పల్‌రావుపేటలో 6.35 ఎకరాలు, నెక్కొండలో 4453.50 మీటర్లు, చంద్రుగొండలో 265.32 మీటర్ల భూమిని సేకరించే పనులను కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. భూములు కోల్పోయే రైతులతో సమావేశమై రేటు నిర్ణయంపై చర్చిస్తున్నారు.

 258 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.