AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సాయుధ దళాలకు ప్రత్యేక స్థానం…

1 min read

AAB NEWS : విజయవాడ: దేశ రక్షణలో అసువులు బాసిన సాయుధ దళాల సిబ్బందిని స్మరించుకోవటం ఆవశ్యకమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తమ అత్యున్నత సేవల ద్వారా భారతీయ సాయుధ దళాలు దేశ పౌరుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయన్నారు. విజయవాడ రాజ్ భవన్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతావని రక్షణలో వీర మరణం పొందిన సాయుధ దళాల కుటుంబ సభ్యులను గవర్నర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. సాయుధ దళాల సిబ్బందికి, వారి కుటుంబాలకు పతాక దినోత్సవం సందర్భంగా గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దేశ సార్వభౌమత్వాన్ని అస్థిర పరిచే బాహ్య శక్తులను నిలువరిస్తూ తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయిధ దళాలను అభినందించేందుకు పతాక దినోత్సవం మంచి సందర్భమని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. గడిచిన మూడు సంవత్సరాల్లో రాష్ట్రం నుంచి మాతృభూమి రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సన్మానించటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన విశాఖపట్నంకు చెందిన సమ్మింగి తులసీరామ్ భార్య రోహిణికి గవర్నర్ నగదు పురస్కారాన్ని అందించారు. పతాక దినోత్సవ నిధికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏటా సహకారం అందించడానికి అంగీకరించడం అభినందనీయమని కొనియాడారు. సాయుధ దళాల పతాక నిధికి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన అధికారులను గవర్నర్‌ అభినందించారు. కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి.రాచయ్య, పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు, జిల్లా సంయుక్త పాలనాధికారి తేజ్‌భరత్‌, తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ విభాగం నుంచి మల్లికార్జున రావులను గవర్నర్ అభినందించారు.

 82 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.