అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
1 min read
AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలంలో గల అభివృద్ధి పనులకు శంకుస్థాపన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక జీవీఎంసీ పరిధి 76 వ వార్డులో గోపాల్ రెడ్డి నగర్ లో ఈరోజు అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు తిప్పన నాగిరెడ్డి గారి చేతుల మీదుగా రోడ్డు నిర్మాణం కొరకు 15.9 లక్షల వ్యయంతో శంకుస్థాపన జరిగినది ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని రోడ్లు కాలువలు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గాజువాక నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు .ఈ కార్యక్రమం 76 వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రంభ నారాయణ మూర్తి,మంత్రి రాజశేఖర్, కమిషనర్ శ్రీధర్, మంత్రి శంకర్నా రాయణ,మర్దిపూడి పరదేసి, తాటికొండ జగదీష్, నక్క వెంకటరమణ, తాటికొండ అచ్యుత్, పిట్ట రెడ్డి, గొందేసి రాము,మంత్రి మంజుల, గోపాల్ రెడ్డి నగర్ ప్రెసిడెంట్ తణుకు సత్యనారాయణ, సెక్రెటరీ రిషికేష్, త్రినాధ రావు, రవీంద్ర, అవినాష్, ,కూర్మా రావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
21 Total Views, 2 Views Today