AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉచిత కంటి వైద్య శిబిరం …

1 min read

AABNEWS ; రిపోర్టర్ జగన్ గాజువాక: విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం ప్రజల ఆశీస్సులతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అని అంటున్నా 76 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డి రమణ జీవీఎంసీ పరిధి అయిన పెదగంట్యాడ గోపాల్ రెడ్డినగరలో విశాఖ డైరీ కిమ్స్ ఐకాన్ సౌజన్యంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి సహాయ సహకారంతో 76 వార్డు వైసిపి అభ్యర్థి రమణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ ఆర్ సిపి గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి,74 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల వంశీ రెడ్డి పాల్గొని వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డి రమణతో కలసి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం దేవన్ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పనిచేస్తున్న వార్డ్ అభ్యర్థి దొడ్డి రమణను అభినందించారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వంనుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు అందేలా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి వైద్య సేవలు అందించడమే కాకుండా కంటికి సంబంధించి వంద మందికి వైద్య పరీక్షలు జరిపించి 40 మందిని ఆపరేషన్ నిమిత్తం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి ఎస్టి ప్రధాన కార్యదర్శి మర్దిపుడి పరదేశి,ట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదీష్,తాడికొండ అచ్చుత్,మంత్రి మంజుల,అండి బోయిన సన్నీ ,కక్కుళ్ల మురళి,బ్రహ్మానంద రెడ్డి,ములకపల్లి ప్రసాద్,కె.బాలాజీ, గోపాల్ రెడ్డి నగర్ ప్రెసిడెంట్ దొడ్డి రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చిన్నారావు సూర్య మహిళా సంఘం రేనా పుష్ప తులసి ఆర్పి మా గుత్తుల లక్ష్మి బొత్స వాసు సచివాలయ సిబ్బంది గాలింకుల భవాని ఎం రేవతి వాసంతి ఉమా తదితరులు పాల్గొన్నారు.

 181 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.