AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన సభ…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా అగనంపూడి మండలం పినమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గన్న వరపు కామేశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా జరిగిన సన్మాన సభ అగనంపూడి పునరావాస కాలనీ సెక్టర్ వన్ పినమడక ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అన్నవరపు కామేశ్వరరావు ఆయన శ్రీమతి ఉమా దేవిని గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది, యాజమాన్య కమిటీ, సహచర ఉపాధ్యాయులు, బంధువులు ఘనంగా సన్మానించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెులుగు వెంకట్రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి కామేశ్వరరావు మార్గదర్శి ఆయన క్రమశిక్షణకు ఉత్తమ బోధన ఎనలేనిదని అన్నరు. ఎ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజములో ఉపాధ్యాయ వృత్తి అతి ఉన్నతమైనదని దేశ భావి పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులకు సహకారం అందించాలని కోరారు. వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు సాలపు అచిబాబు మాట్లాడుతూ కామేశ్వర రావు మాస్టర్ పాఠశాల అభివృద్ధికి పిల్లలకు ఉత్తమ శిక్షణ ఇవ్వడంలో చాలా కృషి చేశారని అన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు భూపతి శామ్యూల్ సన్మానించిసన్మానించితిరి నూతనంగా పాఠశాలలో చేరిన చింతా మోహన్ గారిని అభినందించడం జరిగింది.
పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి కడవల జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అగనంపూడి లైన్స్ క్లబ్ ప్రతినిధులు రామ్ గోపాల్ , కె హనుమంతరావు, వైయస్సార్ సిపి నాయకులు బోబ్బరి అర్జున్, కోలిపాక అపారావు ,మాజీ అధ్యక్షులు కడవల పైడిరాజు తెలుగు మహిళా నాయకురాలు అండ బోయిన జ్యోతి ,పాఠశాల ఉపాధ్యాయులు లు సిహెచ్ సంతోష్ ,సిహెచ్ రమేష్ ,కే కొండబాబు శ్రీమతి శ్యామల శ్రీమతి సత్యవతి , నాయుడు బాబు గ్రామ ప్రజలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాతవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 76 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.