AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కంచరపాలెం పోలీసులకు కరోనా కిట్లు పంపిణీఅభినందించిన సీఐ

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా కంచరపాలెం టౌన్ మండలం కంచరపాలెం పోలీసులకు కరోనా కిట్లు పంపిణీవైసీపీ నేత కొలుసు కుమార్ ను అభినందించిన సీఐ
కంచరపాలెం : కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి పట్ల పోలీసులకు రక్షణ కల్పించేందుకు 57 వ వార్డు వైసిపి నేత కొలుసు కుమారు ఆధ్వర్యంలో
కరోనా కిట్ల పంపిణీ చేయడం అభినందనీయమని కంచరపాలెం సీఐ కృష్ణారావు అన్నారు. సోమవారం కంచరపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్ లు తదితర కరోనా భద్రత కి సిఐ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణారావు మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రజల సహకారం అవసరమన్నారు. కోవిడ్ వారియర్స్ భద్రత కోసం కొలుసు కుమారు లాంటివారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం ఆదర్శనీయం అన్నారు కొలుసు కుమార్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న ప్పటికీ ప్రాణాలకు తెగించి ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులకు కరోనా మహమ్మారి నుండి రక్షణ కల్పించడం మన కనీస బాధ్యత అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధించిన పాక్షిక కర్ఫ్యూ ను పోలీసులు కట్టుదిట్టంగా అమలుచేయడం వలన ప్రజలు హర్షిస్తున్నారన్నారు. తన వంతు సాయంగా గత ఏడాది కూడా అన్నార్తులకు ఆహార ప్యాకెట్లు, కరోనా కిట్లు తదితర సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.పి లింగరాజు సామాజిక గ్రామీణ సంక్షేమ సంఘం ఎల్ రంగారావు, వార్డు ఎస్సీ సెల్ అధ్యక్షుడు కే జై రామ్ జి సునీల్ నూకరాజు పోతురాజు వెంకటేష్, సాయి వార్డు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

 49 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.